ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బెంగళూరు వాసులకు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. నగరానికి జీవనాడిలా ఉన్న ఎలక్ట్రానిక్స్ సిటీ మెట్రో లైన్ (నమ్మ మెట్రో యెల్లో లైన్) చివరికి రైలు పట్టాలపై పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. రానున్న ఆగస్టు 2025 నాటికి ప్రారంభం కావొచ్చని అంచనా. ఈ లైన్ ద్వారా బొమ్మసంద్రా నుంచి ఆర్వీ రోడ్ వరకు ప్రయాణం గణనీయంగా తక్కువ సమయంతో పూర్తవుతుంది. మొదటి దశలో 7 స్టేషన్లు, 3 ట్రైన్లతో ప్రయాణం ప్రారంభమవడటంతో, బెంగళూరుతో పాటు హోసూరు రహదారి ప్రయాణికులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.

ఈ మెట్రో లైన్ ప్రయాణం మొదట మూడు ట్రెయిన్‌లతో, ఏడు స్టేషన్లతో ప్రారంభం కానుంది. మొత్తం 16 స్టేషన్లలో మొదట 7 స్టేషన్లే సేవలకు అందుబాటులోకి రానున్నాయి. అవి ఆర్వీ రోడ్, జయదేవ హాస్పిటల్, సెంట్రల్ సిల్క్ బోర్డ్, కుడ్లు గేట్, హోస రోడ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోనప్పన అగ్రహార, బొమ్మసంద్ర. 20 నిమిషాల ఫ్రీక్వెన్సీతో రైళ్లు నడవనున్న ఈ మెట్రో లైన్ నగరానికి ట్రాఫిక్ కష్టాల నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించనుంది.
ఎందుకు ఇలా ఆలస్యం అయ్యింది?
ఈ ప్రాజెక్ట్‌కు ఎదురైన సవాళ్లు చిన్నవి కావు. కోవిడ్ వల్ల ఆలస్యం, చైనా-ఇండియా సరిహద్దు సమస్యలు, మేక్ ఇన్ ఇండియా నిబంధనలు, అంతర్జాతీయ పెట్టుబడి పరిమితులు ఇవన్నీ కలసి టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ ఉన్నప్పటికీ మెట్రో పనులను వాయిదా వేస్తూ వచ్చాయి.
ట్రెయిన్ కోచ్‌లు తయారీలో భాగంగా చైనా CRRC మరియు కోల్‌కతా కేంద్రంగా పనిచేసే టిటాగఢ్ సంస్థ భాగస్వామ్యం కావడం వల్ల కూడా ఆలస్యానికి కారణమైంది. పైగా, ట్రెయిన్‌లలో ఉపయోగించే ప్రొపల్షన్ సిస్టమ్‌లు జపాన్ నుంచి రావాల్సివుండటం ఆలస్యాన్ని మరింత పెంచింది.
ఈ లైన్ పూర్తిగా ఎలివేటెడ్ మార్గంగా ఉండటంతో, ట్రాఫిక్‌ను తాకకుండా మానవ శబ్దం, కాలుష్యం లేకుండా సాఫీగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా బెంగళూరులో పని చేసే లక్షల ఐటీ ఉద్యోగులకు ఇది అనేక మార్గాల్లో ఉపయోగపడనుంది. బస్సుల మీద ఆధారపడకుండా వేగంగా ఉద్యోగస్థలాలకు చేరుకోవడం ఇప్పుడు సాధ్యమే. భవిష్యత్‌లో ఈ యెల్లో లైన్‌కి గ్రీన్, పింక్, బ్లూ లైన్లతో ఇంటర్‌చేంజ్ సౌకర్యం కల్పించనుండటం మరో పెద్ద ప్లస్ పాయింట్.
ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్‌మెంట్ (ISA) సర్టిఫికెట్ వచ్చిన తర్వాత, CMRS (Commissioner of Metro Railway Safety) అధికారికంగా పరిశీలన చేస్తారు. ఆమోదం లభించిన వెంటనే ఆగస్టు చివరిలో ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. పూర్తి స్థాయిలో సేవలు, అదనపు ట్రెయిన్‌లు వచ్చిన తర్వాత ప్రారంభిస్తారు. అక్టోబర్ నాటికి మరో ఐదు ట్రెయిన్‌లు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications