For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ రిటైల్‌లో ముబాదాల రూ.6,247 కోట్ల పెట్టుబడి

|

రిలయన్స్ రిటైల్ కంపెనీలోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. అబుదాబీకి చెందిన సావరిన్‌ వెల్త్ ఫండ్‌ ముబాదాల ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ విభాగంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(RRVL)లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. రూ.6,247.5 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 1.4 శాతం వాటాని దక్కించుకుంది. రిలయన్స్ రిటైల్‌లోకి ఇది నాలుగో పెట్టుబడి. గత నెల రోజుల్లోనే ముఖేష్ అంబానీ నాయకత్వంలోని ఈ రిటైల్ చైన్‌లో నాలుగు పీఈ సంస్థలు దాదాపు రూ.24,850 కోట్లతో 5.65 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఇటీవల ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు అంతర్జాతీయ పీఈ, సావరిన్ వెల్త్ ఫండ్స్ రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

ముబాదాల ఇప్పటికే రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో రూ.9వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసి 1.85 శాతం వాటాను దక్కించుకుంది. ఈ ట్రాన్సాక్షన్‌తో రియన్స్ రిటైల్ ప్రీ-మనీ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.28 లక్షల కోట్లుగా తేల్చారు. ఇటీవల అమెరికా ప్రయివేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ జనరల్ అట్లాంటిక్ రూ.3,675 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. గత మూడు వారాలుగా RRVLలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.

 Mubadala to invest Rs 6,247 crore in Reliance Retail

కేకేఆర్ రూ. 5,550 కోట్లతో1.28 శాతం వాటాను, జనరల్ అట్లాంటిక్ రూ.3,675 కోట్లతో 0.84 శాతం వాటాను, దక్కించుకున్నాయి. సిల్వర్ లేక్ రెండు విడతలుగా మొత్తం రూ. 9,375 కోట్లు పెట్టుబడులతో 2.13 శాతం వాటాను దక్కించుకుంది.

రిలయన్స్‌లోకి భారీ పెట్టుబడులు

English summary

రిలయన్స్ రిటైల్‌లో ముబాదాల రూ.6,247 కోట్ల పెట్టుబడి | Mubadala to invest Rs 6,247 crore in Reliance Retail

Reliance Industries said on Thursday Abu Dhabi’s sovereign fund, Mubadala Investment Co, would invest Rs 6,247 crore in Reliance Retail Ventures, becoming the latest in a bevy of global funds injecting billions of dollars in the holding entity of India’s largest retailer.
Story first published: Friday, October 2, 2020, 8:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X