ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లోని సావరీన్ వెల్త్ ఫండ్స్‌లలో మూడు పెట్టుబడి కోసం రిలయన్స్‌తో చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2021 మార్చి నాటికి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా చేసే ప్రయత్నాల్లో ముఖేష్ అంబానీ పెట్టుబడులు సమీకరిస్తున్నారు. అబుదాబీకి చెందిన ముబాదాల ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

రూ.9,093.60 కోట్ల పెట్టుబడితో..
ముబాదాల రూపంలో రిలయన్స్‌కు ఇది ఆరో అతిపెద్ద పెట్టుబడి. జియో ప్లాట్‌ఫామ్ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్ల వద్ద ఈ డీల్ కుదిరింది. అబుదాబికి చెందిన ఈ ముబాదాల కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.9,093.60 కోట్ల పెట్టుబడితో 1.85 శాతం వాటాను దక్కించుకోనుంది. గత ఆరు వారాలుగా ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ముబాదాల కొత్త పెట్టుబడి.

ఆరు వారాల్లో రూ.87,655.35 కోట్లు
- జియో ప్లాట్‌ఫాంలోకి ఆరువారాల్లో ఇది ఆరో పెట్టుబడి.
- జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజెస్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్ల వద్ద డీల్ కుదిరింది.
- జియోలోకి ఇదివరకు ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ కంపెనీ పెట్టుబడి పెట్టాయి. ముబాదాల పెట్టుబడితో జియో ప్లాట్‌ఫాంలోకి మొత్తం రూ.87,655.35 కోట్లు వచ్చాయి.

ముబదాలా
ముబాదాల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఏరోస్పేస్, ఐసీటీ, సెమీ కండక్టర్స్, మెటల్స్, మైనింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రో కెమికల్స్, యుటిలిటీస్, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, ఫార్మాస్యూటికల్స్ మెడికల్ టెక్నాలజీ, అగ్రిబిజినెస్, గ్లోబల్ పోర్ట్‌పోలియో నిర్వహిస్తోంది. ముబాదాల కంపెనీ ఐదు ఖండాలలో 229 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications