MRF Share: మార్కెట్లో MRF షేర్ల రికార్డుల మోత.. రేటు తెలిస్తే గుండె ఆగిపోద్ది..
MRF Share: స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీల షేర్లు ఉంటాయి. అయితే వాటి ధర మహా అయితే రూపాయల నుంచి వేల వరకు ఉంటుంటాయి. కానీ మనం మాట్లాడుకోబుతున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ షేర్లు బాహుబలి ధరకు అమ్ముడవుతున్నాయి.
అవును తమిళనాడుకు చెందిన టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్ మంగళవారం స్టాక్ మార్కెట్‌లో కొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలో షేర్ ధర ఏకంగా ఒక్కొక్కటి రూ.లక్ష దాటాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో షేరు ధర లక్ష దాటిన ఏకైక కంపెనీగా ఎంఆర్ఎఫ్ నిలిచింది. నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్ల ధర 1.37 శాతం పెరిగి రూ.1,00,300కి చేరుకున్నాయి. ఇదే క్రమంలో కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.65,900గా ఉంది. అంటే ఏడాది కాలంలో ఒక్కో షేరు ధర దాదాపు రూ.34 వేల మేర లాభపడింది.

ఫ్యూచర్స్ మార్కెట్ తర్వాత.. షేర్ ఇప్పుడు స్పాట్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. మే 8, 2023న ఫ్యూచర్స్ మార్కెట్‌లో MRF షేర్లు రూ.లక్ష స్థాయికి చేరుకున్నాయి. తమిళనాడులోని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఎంఆర్ఎఫ్ టైర్ల తయారీ సంస్థ మెుత్తంగా కేవలం 42,41,143 షేర్లను మాత్రమే కలిగి ఉంది. వాటిలో 30,60,312 పబ్లిక్ షేర్‌హోల్డర్ల వద్ద ఉండగా.. మిగిలిన 11,80,831 షేర్లు ప్రమోటర్ల హోల్డ్ చేస్తున్నారు.
ఒక సంవత్సరం కిందటితో పోల్చితే కంపెనీ షేర్ ధర దాదాపు 45 శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. జూన్ 13, 2022న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో టైర్ కంపెనీ షేర్లు రూ.68,561.25 స్థాయిలో ఉన్నాయి. ఆ తర్వాత తాజాగా 13 జూన్ 2023న రూ.1,00,300కి చేరుకున్నాయి. ఇదే సమయంలో MRF షేర్లు 2023లో ఇప్పటివరకు దాదాపు 14% లాభపడ్డాయి. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 2, 2023న కంపెనీ షేర్ ధర రూ.88,080.35 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications