Dividend Stock: ఒక్కో షేరుపై రూ.194 డివిడెండ్ ఆఫర్ చేస్తున్న స్టాక్.. పూర్తి వివరాలు

MRF Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ఒకపక్క బడ్జెట్ ప్రకటనపై ఊహాగానాలు కొనసాగుతుండగా.. మరోపక్క కార్పొరేట్ కంపెనీల బలమైన లాభాల ప్రకటన ఇన్వెస్టర్లను ముందుకు నడిపిస్తోంది. ఈ క్రమంలో చాలా మంది డివిడెండ్ అందించే కంపెనీల షేర్లపై బెట్టింగ్ వేసేందుకు ఆసక్తింగా తమ అన్వేషనను కొనసాగిస్తున్నారు.

దేశీయ ఆటో రంగంలో అతిపెద్ద ఆటగాళ్లలో ఒకటి MRF కంపెనీ. తాజాగా కంపెనీ భారీ డివిడెండ్ ప్రకటించటంపై ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. వాస్తవానికి భారతీయ స్టాక్ మార్కెట్‌లో MRF షేర్లు అత్యధిక ధరను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ ఒక్కో షేరుపై రూ.194 డివిడెండ్ ప్రకటించింది. డివిడెండ్ కోసం రికార్డు తేదీని జూలై 25, 2024గా నిర్ణయించింది. అంటే ప్రకటించిన రికార్డు తేదీ లోపు MRF షేర్లను కలిగి ఇన్వెస్టర్లు మాత్రమే డివిడెండ్ ప్రయోజనం అందుకుంటారు.

MRF stock announced 194 Rupees Dividend per share Know record date

ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ ఎక్స్-డివిడెండ్ స్టాక్‌గా ట్రేడైంది. అప్పుడు కంపెనీ ఒక్కో షేరుకు కేవలం రూ.3 డివిడెండ్ అందించింది. గత సంవత్సరం కూడా ఇదే నెలలో MRF ఎక్స్-డివిడెండ్ ట్రేడైంది. అప్పుడు కంపెనీ ఒక షేరుపై రూ.169 డివిడెండ్ ఇచ్చింది. కంపెనీ 2000 సంవత్సరంలో తొలిసారిగి తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ అందించింది. అప్పట్లో కంపెనీ షేరుపై రూ.3 డివిడెండ్ చెల్లించింది. అప్పటి నుంచి వరుసగా డివిడెండ్ ప్రకటిస్తూనే ఉంది.

శుక్రవారం మార్కెట్ ముగింపు సమయానికి కంపెనీ షేర్లు 3.25 శాతం క్షీణించి రూ.1,27,988.75 వద్ద ఉన్నాయి. గత ఏడాది కాలంలో కంపెనీ షేర్ల ధర 25.70 శాతం పెరిగింది. గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్లు 11.90 శాతం క్షీణించాయి. MRF కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ట ధర రూ.1,51,283.40గా ఉండగా.. 52 వారాల కనిష్ట ధర రూ.1,01,447గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.54,281.86 కోట్లుగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+