Mphasis: ఏడాదిలో సుమారు సగానికి పడిపోయిన Mphasis షేరు వాల్యూ.. Buy రేటింగ్ ఇచ్చిన ICICI, HDFC సెక్యూరిటీస్
Mphasis: ప్రముఖ భారతీయ IT సంస్థ Mphasis భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది. కంపెనీ షేర్ల విలువ పెద్దమొత్తంలో క్షీణించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 45.75 శాతం మేర కుప్పకూలింది. అప్పటి స్టాక్ ధర రూ.3,312 కాగా.. ప్రస్తుతం రూ.1,797 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ IT ఇండెక్స్ క్షీణత 21.22 శాతం కంటే దారుణంగా విలువ కోల్పోయింది. తద్వారా రెండేళ్ల కనిష్ఠ స్థాయికి షేర్ విలువ దిగజారింది. అక్టోబర్ 18, 2021న రూ.3,659 గరిష్ఠ స్థాయితో పోలిస్తే 50.88 శాతం క్రాష్ అయింది.
మార్చి 10న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత Mphasis స్టాక్ లో భారీ క్షీణత కనిపించింది. 12 ట్రేడింగ్ సెషన్‌లలో సుమారుగా 18.10 శాతం కరెక్షన్ నమోదైంది. SVBకి కంపెనీ ఎక్స్‌పోజర్ పై ఆందోళనలే దీనికి కారణంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల కుప్పకూలిన US బ్యాంకులకు సంబంధించి తమకు ఎలాంటి ఎక్స్‌పోజర్ లేదని మార్చి 29న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం నెలకొన్న అస్థిర, అధిక వాల్యూమ్స్ వాతావరణంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు IT సంస్థ తెలిపింది. US ప్రాంతీయ బ్యాంకుల నుంచి తమ వ్యాపారానికి వచ్చే రాబడి మొత్తం చాలా తక్కువగా సింగిల్ డిజిట్ కే పరిమితమని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ రాకేష్ వెల్లడించారు.
US బ్యాంకులకు Mphasis ఎక్స్‌పోజర్ పై కంపెనీ క్లారిటీ ఇచ్చిన అనంతరం బ్రోకరేజ్ సంస్థ ICICI సెక్యూరిటీస్ తమ రేటింగ్ ను సవరించింది. ఏడాదిలో షేరు విలువ రూ.2,061 కి చేరుతుందని భావిస్తున్నట్లు చెప్పింది. అంటే 14.70 శాతం పైకి ఎగబాకనున్నట్లు తెలిపింది. FY24కి గాను 5.5 అనంతరం FY25లో 15.4, FY26లో 12.9 శాతాలు చొప్పున డబుల్ డిజిట్ వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. HDFC సెక్యూరిటీస్ సైతం రూ.2,450 టార్గెట్ ధరతో కొనుగోలు రేటింగ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications