Shashi Tharoor: ఇన్ఫోసిస్ మూర్తి, బిల్ గేట్స్ వ్యాఖ్యలపై శశిథరూర్ కీలక కామెంట్స్..!!
Shashi Tharoor: ప్రస్తుతం దేశీయ కార్పొరేట్ ప్రపంచంలో ఎక్కువ పని గంటలపై చర్చ కొనసాగుతోంది. ఎక్కువ పనిగంటలు అవసరమని కొందరు భావిస్తుంటే.. ఏఐతో పని తగ్గిపోతుందని ఇంకొకరు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కొన్ని వారాల కిందట ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశంలో యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని సూచించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఎక్కువ సమయంలో అందుకు కేటాయించాలని తెలిపారు. ఇది ఉద్యోగులు, కార్పొరేట్లలో పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది ఈ ఆలోచనను ఖండించారు. ఇది పని ఒత్తిడిని పెంచుతుందని, కుటుంబంతో సమాజంతో గడిపేందుకు సమయం లేకుండా చేస్తుందని అభిప్రాయపడ్డారు.

మరో పక్క అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రాబోతున్న రోజుల్లో పనిపై కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటి మాదిరిగా ప్రజలు ఎక్కువ సమయంలో పనిలో గడపాల్సిన అవసరం ఉండదని అన్నారు. వారానికి మూడు రోజులు మాత్రమే పనిచేస్తే సరిపోతుందంటూ ఏఐ ప్రవేశం ప్రభావం గురించి వెల్లడించారు. ప్రజలపై ఏఐ పని భారాన్ని తగ్గిస్తుందని వారికి అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
అయితే ఈ అంశంపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ వేధికగా స్పందించారు. బిల్ గేట్స్, నారాయణ మూర్తి విభిన్న అభిప్రాయాలపై కాంగ్రెస్ ఎంపీ తన సొంత ఆలోచన గురించి వ్యక్తీకరించారు. బిల్ గేట్స్- నారాయణమూర్తి కలిసి కూర్చుని ఈ అంశంపై రాజీ కుదుర్చుకోవాలని అన్నారు. ప్రస్తుతం మనం పాటిస్తున్న వారానికి ఐదు రోజుల పని విధానం దగ్గరకే తిరిగి చేరుకుంటామని అభిప్రాయపడ్డారు. థరూర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అనేక మంది తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


Click it and Unblock the Notifications