లక్షల్లో జీతం, కరెంట్ & కార్, ఫ్లయిట్ కూడా ఫ్రీ.. ఒక ఎంపీకి ఇన్ని సౌకర్యాలు ఉంటాయా... !

మన దేశంలోని ఎంపీల జీతం మరోసారి పెరిగింది. ప్రభుత్వం వీరి జీతాన్ని 24% పెంచింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది, దీని ప్రకారం ఇప్పుడు ఎంపీలు నెలకు రూ.1.24 లక్షల జీతం పొందుతారు. గతంలో ఈ మొత్తం నెలకు లక్ష రూపాయలు ఉండేది.

mp salaries hiked again do you know how much salary they get paid and what benefits they avail

ఈ పెరుగుదల వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా చేసింది అలాగే 1 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వస్తుంది. అయితే మోడీ ప్రభుత్వం 2018లో ఒక నియమాన్ని రూపొందించింది, దీని ప్రకారం ఎంపీల జీతం, అలవెన్సులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తారు. ఈ సమీక్ష ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ పెంపు కింద జీతం మాత్రమే కాదు, డైలీ అలవెన్సులు ఇంకా పెన్షన్ కూడా మారింది.

మాజీ ఎంపీల పెన్షన్ల పెంపు: గతంలో నెలకు రూ.25,000 ఉండేది ఇప్పుడు నెలకు రూ.31,000కి పెంచారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఎంపీలకు అదనపు పెన్షన్ గతంలో సంవత్సరానికి రూ.2000 నుండి ఇప్పుడు సంవత్సరానికి రూ.2500 పెంచారు. ఇక నియోజకవర్గ అలవెన్స్ చూస్తే గతంలో నెలకు రూ.70,000 నుండి ఇప్పుడు నెలకు రూ.87,000 మార్చారు. అంతేకాదు ఆఫీస్ ఖర్చులకి గతంలో నెలకు రూ.60,000 నుండి ఇప్పుడు నెలకు రూ.75,000 చేసారు. ఇందులో కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.50,000, స్టేషనరీకి రూ.25,000 కలిపి ఉంటుంది. డీఏ గతంలో రోజుకు 2 వేలు ఇప్పుడు రోజుకు రూ.2500 చేసారు.

ఫర్నిచర్ ఖర్చులు చూస్తే ఎంపీలకి లక్ష వరకు మన్నికైన ఫర్నిచర్, రూ. 25,000 వరకు మన్నిక లేని ఫర్నిచర్ కొనేందుకు సౌకర్యం ఉంటుంది. 2018లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎంపీల జీతాన్ని రూ.50,000 నుండి రూ.1,00,000కు పెంచారు. అలాగే, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్ శాలరీ రివ్యూ ఉండాలని నిర్ణయించారు. అయితే, 2020లో COVID-19 మహమ్మారి సమయంలో, ప్రభుత్వం ఎంపీల జీతాలను 30% తగ్గించింది, తరువాత మళ్ళీ పునరుద్ధరించారు.

ఉచిత ప్రయాణాల విషయంలో ఒక ఎంపీ సంవత్సరానికి 34 సార్లు ఉచితంగా విమానంలో ప్రయాణించవచ్చు. అతను కోరుకుంటే సహోద్యోగులకు లేదా సిబ్బందికి 8 టిక్కెట్లను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అలాగే భారతీయ రైల్వేలలో ఫస్ట్ ఏసీలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఢిల్లీలో ప్రభుత్వ వసతితో 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్, 4 లక్షల లీటర్ల ఉచిత నీరు ఉపయోగించుకోవచ్చు. లోక్‌సభ ఎంపీలకు 1,50,000 ఉచిత కాల్స్, రాజ్యసభ ఎంపీలకు 50,000 ఉచిత కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.

వైద్య సౌకర్యం విషయానికి వస్తే ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స, పదవీ విరమణ చేసిన ఎంపీలు & వారి జీవిత భాగస్వాములు కూడా CGHS కింద ఉచితంగా చికిత్స లభిస్తుంది. దేశంలో చికిత్స సాధ్యం కాకపోతే, విదేశాలలో చికిత్స ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇంకా ఎంపీలకు అధికారిక పనుల కోసం ప్రభుత్వ కారు ఇస్తుంది. జీతాల పెంపు ఎందుకు అని ఆలోచిస్తే ద్రవ్యోల్బణం కారణంగా ఎంపీల జీతం, అలవెన్సులు పెంచాల్సిన అవసరం ఏర్పడిందనేది ప్రభుత్వ నిర్ణయం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+