IPO News: ప్రైస్ బ్యాండ్ ప్రకటించిన ఐపీవో.. బాలీవుడ్ చిత్రాలు నిర్మించిన కంపెనీ కూడా..
Baweja Studios IPO: ఈనెలాఖరులో మరిన్ని కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఐపీవోలు వచ్చేస్తున్నాయి. గత కొంత కాలంగా ఐపీవోలు సూపర్ పనితీరు కనబరచటంతో చాలా మంది ఇన్వెస్టర్లు సైతం బెట్టింగ్ వేసేందుకు కుతూహలంగా ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బవేజా స్టూడియోస్ లిమిటెడ్ ఐపీవో గురించే. బవేజా స్టూడియోస్ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 1న ముగియనుంది. ఈ ఇష్యూ కోసం కంపెనీ తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కొక్కటి రూ.170-180గా నిర్ణయించింది. ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ ఐపీవో లాట్ పరిమాణాన్ని 800 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో షేర్లను కొనుగోలు చేయాలంటే కనీసం రూ.1,44,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం షేర్ల కేటాయింపు ఫిబ్రవరి 5న జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే స్టాక్ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఫిబ్రవరి 6న అరంగేట్రం చేయవచ్చు. బవేజా స్టూడియోస్ కంపెనీ మార్చి 16, 2001లో స్థాపించబడింది. కంపెనీ సాహిబ్జాదే, లవ్ స్టోరీ 2050, ఖయామత్, స్పీడ్, మెయిన్ ఐసా హాయ్ హూన్, దిల్జాలే, దిల్‌వాలే, తీస్రీ ఆంఖ్ చిత్రాలను నిర్మించింది. ఈ కంపెనీ పంజాబీ చిత్రాలను సైతం నిర్మించింది. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన ఈ చిత్రాలలో అజయ్ దేవగన్ ప్రముఖ నటుడు.
కంపెనీ భౌకాల్ వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించింది. సినిమా రైట్స్‌ను కూడా ఈ సంస్థ ట్రేడింగ్ చేస్తోంది. ఈ కంపెనీ ప్రమోటర్లు హర్జస్పాల్ సింగ్ బవేజా, పరమజిత్ హర్జస్పాల్, హర్మాన్ బవేజా, రోవేనా బవేజా. హర్మన్ బవేజా కంపెనీకి సీఈవోగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బవేజా స్టూడియోస్ లిమిటెడ్ ఆదాయం 86.2 శాతం పెరిగింది. పన్ను తర్వాత లాభం(PAT) 188.8 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications