Motorola: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో మోటోరొలా మొబైల్ ధరలు ప్రకటించారు..!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 అక్టోబర్ 9 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సేల్‌కు ముందు మోటోరొలా తన స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిపై ప్రత్యేక ధరలను ప్రకటించింది. ఈ పండుగ సేల్‌లో మోటోరొలా ఎడ్జ్, G-సిరీస్ ఫోన్‌లు తగ్గింపు ధరలకు లభిస్తాయని పేర్కొంది. మోటోరొలా డ్జ్ 70 ఫ్యూజన్, మోటోరొలా ఎడ్జ్ 70 ప్రొ, మోటరోలా ఎడ్జి 70 ప్రొ+, మోటోరొలా సిగ్నెచర్, మోటో G37 పవర్ వంటి మోడల్స్ తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే అర్హత కలిగిన వినియోగదారులకు అక్టోబర్ 8 నుండే 'ఎర్లీ యాక్సెస్' లభిస్తుంది. Flipkart Big Billion Days Sale సమయంలో Motorola Edge 70 Fusion బేస్ మోడల్ (8GB RAM + 128GB స్టోరేజ్) రూ. 29,999 ప్రారంభ ధరతో లభిస్తుందని Motorola ధృవీకరించింది. ప్రస్తుతం ఈ వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది.
సేల్ సమయంలో Motorola Edge 70 Fusion 12GB + 256GB ధర రూ.32,999 ఉండగా.. 12GB + 512GB వేరియంట్ల ధర రూ.34,999గా ఉంది. Motorola Edge 70 Pro 8GB + 256GB వేరియంట్ రూ. 36,999కి విక్రయించనున్నారు. ప్రస్తుతం దీని ధర రూ. 39,999గా ఉంది. అలాగే 12GB + 256GB వెర్షన్ ధర రూ. 39,999గా ఉంటుంది. Motorola Edge 70 Pro+ 12GB + 256GB కాన్ఫిగరేషన్ రూ. 44,999కి లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ. 47,999గా ఉంది. Moto G37 Power రూ. 16,999 ప్రారంభ ధరతో లభించనుంది. 4GB + 64GB వేరియంట్ ధర అసలు ధర అయిన రూ. 17,249 నుంచి తగ్గి రూ. 16,999కి లభిస్తుంది. 4GB + 128GB వేరియంట్ ధర రూ.18,999 ఉండగా.. 8GB + 128GB మోడళ్ల ధర రూ.24,999గా ఉంది.

మోటోరొలా ప్రీమియం హ్యాండ్‌సెట్ 'మోటోరొలా సిగ్నేచర్' (Motorola Signature) 12GB + 256GB మోడల్ రూ. 57,499 ప్రారంభ ధరతో లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ. 59,999గా ఉంది. 16GB + 512GB వేరియంట్ ధర రూ. 62,499గా ఉండనుంది. ఈ సేల్ సమయంలో కంపెనీ 'Moto G06 Power', 'Motorola Edge 70 Max'లను తగ్గింపు ధరలకు విక్రయించనుంది. Moto G06 Power 4GB + 64GB వేరియంట్ ధర రూ. 15,249కి బదులుగా రూ. 13,999గా ఉంటుంది. Motorola Edge 70 Max 8GB + 256GB వేరియంట్ ధర రూ. 51,999 లభించనుంది. దీని ప్రస్తుత ధర రూ.54,999గా ఉంది. 12GB + 256GB మోడల్ ధర రూ. 56,999గా ఉండనుంది.
ఈ తగ్గింపు ధరలు పరిమిత కాలం పాటు, స్టాక్ లభ్యతకు లోబడి ఉంటాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ ఆఫర్లలో చాలా వరకు అక్టోబర్ 9న అందుబాటులోకి వస్తాయి. అయితే అక్టోబర్ 8 నుండే 'ఎర్లీ యాక్సెస్' (ముందస్తు అవకాశం) లభిస్తుంది. Motorola Edge 70 Pro+ సెప్టెంబర్ 27 నుంచి తగ్గింపు ధరలకు లభిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ పేర్కొన్న తగ్గింపు ధరలలో బ్యాంక్ ఆఫర్లు, ప్రీ-పెయిడ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కలిసి ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
