IPO News: డబ్బులు డబుల్ చేసిన ఐపీవో.. మెుదటి రోజే లాభాల వేట..
Motisons Jewellers IPO: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు మెుదలు కావటంతో నేడు వరుసగా ఐపీవోలు లిస్టింగ్ కోసం క్యూ కట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల తుఫానులో కొట్టుకుపోతున్నారు.
మార్కెట్లో నేడు జాబితా అయిన మోటిసన్స్ జ్యువెలర్స్ స్టాక్ మార్కెట్‌లో లాభాల హల్‌చెల్ చేస్తోంది. కంపెనీ షేర్లు మార్కెట్‌లో రూ.109 రేటు వద్ద లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇష్యూ గరిష్ఠ ధరను రూ.55గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పెట్టుబడిదారుల నుంచి వచ్చిన విశేష స్పందనతో ఐపీవో నేడు 98 శాతం కంటే ఎక్కువ ప్రీమియం రేటు వద్ద జాబితా అయ్యింది. బీఎస్ఈలో మోటిసన్స్ జ్యువెలర్స్ స్టాక్ సుమారు 89 శాతం ప్రీమియంతో రూ.103.90 రేటు వద్ద లిస్టింగ్ జరిగింది.

అలాగే స్టాక్ ఎన్ఎస్ఈలో లిస్టింగ్ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా కొంత అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. దీంతో షేర్ ధర 5 శాతం క్షీణించి రూ.103.55 వద్దకు చేరుకుంది. ఇదే క్రమంలో బీఎస్ఈలో స్టాక్ 3 శాతం క్షీణతకు గురై రూ.100 స్థాయికి చేరుకుంది. మెుత్తానికి IPOలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు మెుదటి రోజే ఒక్కో షేరుపై రూ.54 లాభాన్ని పొందారు. ఐపీవో ఇష్యూకి ముందర కంపెనీలో ప్రమోటర్ల వాటా 91.60 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 66 శాతానికి తగ్గింది.
ఐపీవో సబ్‌స్క్రిప్షన్ పరిశీలిస్తే.. మొత్తం 173.23 రెట్లు బెట్టింగ్‌లు జరిగింది. కంపెనీ ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 135.60 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 311.99 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో 135.01 రెట్లు పందెం వేయబడ్డాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్ ఐపీవోలో కనీసం రూ.13,750 పెట్టుబడిగా పెట్టారు.


Click it and Unblock the Notifications