గత ఏడాది వెండి మార్కెట్‌కు చారిత్రక మలుపుగా నిలిచింది. కేవలం ఒక్క ఏడాదిలోనే సుమారు 170 శాతం ర్యాలీ సాధించిన వెండి.. ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో అత్యంత వేగంగా దృష్టిని ఆకర్షించిన ఆస్తిగా మారింది. ఈ అసాధారణ పెరుగుదలతో చాలా మంది పెట్టుబడిదారులు ఇక్కడితో ప్రయాణం ముగిసిందా? అనే ప్రశ్న వేస్తున్న వేళ.. ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ మాత్రం పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. వెండి ఇప్పుడు భారీ పెరుగుదల దశలోకి అడుగుపెట్టిందని సంస్థ విశ్లేషణ చెబుతోంది. అంటే, 2025లో చూసిన ర్యాలీ చివరి ఘట్టం కాదని, దీర్ఘకాలిక పెరుగుదలకి ఇది పునాది మాత్రమే కావచ్చని అంచనా.
మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం.. 2025 ఏప్రిల్‌లో రూ.90 వేలు వద్ద ఉన్న వెండి ధరలు డిసెంబర్ నాటికి ఏకంగా రూ.2.5 లక్షల స్థాయికి చేరాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత వేగంగా పెరగడం కమోడిటీ మార్కెట్లలో చాలా అరుదైన విషయం. సంవత్సరం ముందుకు సాగేకొద్దీ ర్యాలీలు మరింత తక్కువ వ్యవధిలో, ఎక్కువ తీవ్రతతో చోటుచేసుకున్నాయని బ్రోకరేజ్ పేర్కొంది. ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా నాలుగు అంశాలు కలిసి పనిచేశాయి. భౌతిక సరఫరా బిగుతు, పారిశ్రామిక డిమాండ్‌లో భారీ వృద్ధి, ఎక్స్ఛేంజ్ నిల్వల తగ్గుదల, అలాగే భౌగోళిక రాజకీయాలు, ద్రవ్య అనిశ్చితుల నేపథ్యంలో ఏర్పడిన సేఫ్-హేవన్ డిమాండ్ గా నిలిచింది.

మోతీలాల్ ఓస్వాల్ Silver భవిష్యత్తును కేవలం ధరల కోణంలో కాకుండా, నిర్మాణాత్మక మార్పుల దృష్టితో చూస్తోంది. మొదటగా.. పారిశ్రామిక వినియోగం. వెండి ఒకవైపు విలువైన లోహం కాగా, మరోవైపు కీలక పారిశ్రామిక ఇన్‌పుట్ గా నిలుస్తోంది. 2025లో సౌర విద్యుత్ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రిడ్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో వినియోగం కొత్త గరిష్టాలకు చేరింది. క్లీన్ ఎనర్జీ మార్పు వేగవంతం అవుతున్న కొద్దీ ఈ డిమాండ్ దీర్ఘకాలికంగా కొనసాగుతుందని సంస్థ అంచనా.
రెండవది సరఫరా పరిమితులు.. మైనింగ్ రంగంలో పెట్టుబడులు తగ్గడం, ధాతువు నాణ్యత పడిపోవడం, వెండి ఎక్కువగా మూల లోహాల ఉప-ఉత్పత్తిగా లభించడం వంటి అంశాలు సరఫరాపై ఒత్తిడి తెస్తున్నాయి. షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్ మరియు LMEలో నిల్వలు గణనీయంగా తగ్గినట్టు నివేదిక సూచిస్తోంది. మూడవది ETF ప్రవాహాలు.. 2025లో వెండి, బంగారం ETFల AUM సుమారు 150 శాతం పెరగడం పెట్టుబడిదారుల నమ్మకం తిరిగి వచ్చిందని సూచిస్తోంది. సంవత్సరాల పాటు నీరసంగా ఉన్న ETF ప్రవాహాలు రెండో అర్ధభాగంలో స్పష్టంగా పాజిటివ్‌గా మారాయి.
నాలుగవది మాక్రో కరెన్సీ ప్రభావాలు.. రూపాయి బలహీనత, డాలర్ ఇండెక్స్ తగ్గుదల, అలాగే కేంద్ర బ్యాంకుల విధానాలపై ఉన్న అనిశ్చితి వెండిని పోర్ట్‌ఫోలియో హెడ్జ్‌గా మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
2026 మొదటి అర్ధభాగంలో వెండి బలంగా ఉండే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. అయితే 2025లో వచ్చిన భారీ ర్యాలీ తర్వాత లాభాల బుకింగ్, గ్లోబల్ వడ్డీ రేటు మార్పుల కారణంగా రెండో అర్ధభాగంలో అస్థిరత పెరగవచ్చని హెచ్చరిస్తోంది. అయినా కూడా.. నిర్మాణాత్మక డిమాండ్, సరఫరా పరిమితులు వెండికి బలమైన మద్దతుగా నిలుస్తాయని సంస్థ భావిస్తోంది.
అంతర్జాతీయంగా COMEXలో వెండి ధరలు ఔన్సుకు 30 డాలర్లకు చేరవచ్చని అంచనా. దేశీయంగా MCX వెండికి 2026 లక్ష్యం రూ.3,20,000గా నిర్ణయించారు. రిస్క్ నియంత్రణ స్థాయిని రూ.1,40,000గా సూచిస్తూ బై ఆన్ డిప్స్ వ్యూహాన్ని కొనసాగించాలని మోతీలాల్ ఓస్వాల్ సూచిస్తోంది. ఏదేమైనా 2025 వెండికి బ్రేక్‌అవుట్ సంవత్సరం కాగా.. 2026 ఆ ప్రయాణానికి కొనసాగింపుగా ఉండవచ్చని బ్రోకరేజ్ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications