Ambani: అంబానీ కంపెనీ షేర్లు కొన్న మ్యూచువల్ ఫండ్.. వామ్మో ఇన్నా..!!
Jio Financial: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని చాలా మంది ఇన్వెస్టర్లు ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల డీమెర్జ్ అయి ప్రత్యేకంగా ఏర్పడిన జియో ఫైనాన్షియల్ పై అందరి దృష్టి ప్రస్తుతం ఉంది.
ఈ క్రమంలో వరుస నష్టాల తర్వాత ట్రేడింగ్ మెుదలు పెట్టిన జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ కంపెనీల షేర్ల కోసం కేవలం రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం ఎగబడుతున్నాయని వెల్లడైంది. తాజాగా శుక్రవారం నాడు దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంబానీకి చెందిన కొత్త కంపెనీలో 3.72 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఈ డీల్ ప్రకారం ఒక్కో షేరును రూ.202.80 వద్ద కొంది. ఇందుకోసం రూ.754.41 కోట్లను వెచ్చించింది.

ఇంత భారీ డీల్ జరిగిన తర్వాత ఇంట్రాడేలో జియో ఫైనాన్షియల్ స్టాక్ తిరిగి పుంజుకుంది. నష్టాల నుంచి తేరుకుని దాదాపు 3.82 శాతం లాభపడి చివరికి శుక్రవారం ఎన్ఎస్ఈలో స్టాక్ రూ.221.60 రేటు వద్ద ట్రేడింగ్ ముగించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(JFSL) ఆగస్ట్ 21న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయబడింది. అయితే శుక్రవారం ఆర్థిక సేవల సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ BSEలో రూ.1.35 లక్షల కోట్లకు చేరువైంది.
సెన్సెక్స్, ఇతర BSE సూచీల నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తొలగింపు మరో మూడు రోజుల పాటు వాయిదా పడింది. దీంతో తొలగింపు సెప్టెంబర్ 1న జరగనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆగస్టు 24, 25 రెండింటిలోనూ స్టాక్ లోయర్ సర్క్యూట్‌ను తాకిందని S&P డౌ జోన్స్ ఇండిసెస్ వెల్లడించింది. దీనికి ముందు JFSL షేర్లు నిఫ్టీ 50, సెన్సెక్స్ నుంచి ఆగష్టు 24న తొలగించబడతాయని ముందుగా నిర్ణయించబడింది. స్టాక్ దిగువ సర్క్యూట్‌ను తాకడం వలన అది తొలుత ఆగస్టు 29కి వాయిదా వేయబడింది.


Click it and Unblock the Notifications