వాషింగ్టన్: అంతర్జాతీయ మాతృ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకొంటుంటారు. ఆ పండుగ మరోమారు మన ముందుకొచ్చింది. సెలవు లేకుండా ప్రతిరోజూ శ్రమించే అమ్మకు ప్రతి ఒక్కరూ ప్రేమగా శుభాకాంక్షలు తెలపుకొంటుంటారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ ద్వారా మాతృమూర్తులకు మదర్స్ డే (Mother's Day 2021) గ్రీటింగ్స్ పంపిస్తుంటారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో నివసిస్తోన్న వాళ్లు.. తమ తల్లులకు గ్రీటింగ్స్ తెలపడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగిస్తుంటారు.
దీన్ని మరింత సరళీకరించింది వాట్సప్ మేనేజ్‌మెంట్. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ స్పెషల్ గిఫ్ట్‌ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మమా లవ్ (Mama Love) అని దీనికి పేరు పెట్టింది. ఈ గిఫ్ట్ ప్యాక్ కింద మాతృమూర్తులకు సంబంధించిన స్టిక్కర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిఫరెంట్ స్టైల్స్‌లో ఉండే స్టిక్కర్లను వాట్సప్ తాజాగా అప్‌డేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల మీద నడిచే అన్ని మొబైల్ హ్యాండ్‌సెట్స్ ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మొత్తం 11 రకాల స్టిక్కర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ యానిమేటెడ్. వాట్సప్ స్టిక్కర్ స్టోర్ నుంచి వాటిన్నింటిని ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకునే వెసలుబాటు ఉంది. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. వాట్సప్ చాట్‌ను ఓపెన్ చేసిన తరువాత.. కింద బాటమ్ ట్రేలో ఉన్న ఎమోజీ బటన్‌పై ప్రెస్ చేయాలి. ప్టిక్కర్ ఐకన్‌ను ట్యాప్ చేసిన అనంతరం ప్లస్ బటన్‌ను ప్రెస్ చేయాలి. వెంటనే వాట్సప్ స్టిక్కర్ స్టోర్‌లోకి తీసుకెళ్తుందది. అనంతరం వాటిన్నింటినీ ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తమ తల్లులకు వెరైటీగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications