న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతోన్న ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై పడటం ఆరంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మోపుతోన్న భారాన్ని రవాణా రంగం ఏ మాత్రం మోయలేకపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా సరుకుల రవాణా ఛార్జీలను పెంచేస్తోన్నాయి. దీని ప్రభావం అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ సామాన్యుడిపైనే పడుతోంది. ఇది ఒక్క రవాణా రంగానికి మాత్రమే పరిమితం అయ్యేలా కనిపించట్లేదు. రవాణా సహా పరిశ్రమలు, వ్యవసాయం వంటి కీలక సెక్టార్లపై పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల దుష్ప్రభావం పడటం ఖాయం.

డీజిల్ ఎఫెక్ట్..
దేశవ్యాప్తంగా డీజిల్ ధర వంద రూపాయల ల్యాండ్‌మార్క్‌కు చేరువ అవుతోంది. శ్రీగంగానగర్ వంటి పట్టణాల్లో ఈ మార్క్‌ను దాటేసింది కూడా. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా అనేక మెట్రో నగరాలు, మధ్యస్థాయి పట్టణాల్లో డీజిల్ ధర 90 నుంచి 100 రూపాయల్లోపు ఉంటోంది. పెట్రో రేట్ల పెంపుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు నిరసన ప్రదర్శనలకు దిగుతోన్నప్పటికీ చమురు కంపెనీలు వాటిని ఏ మాత్రం పట్టించుకోవట్లేదనేది రోజువారీ పెంపుదలతో స్పష్టమౌతోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసల మేర పెంపుదల కనిపించింది.

రవాణా రంగం కుదేల్..
డీజిల్‌ను వినియోగించే రవాణారంగం దీని దెబ్బకు కుదేల్ అవుతోంది. ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు సరుకుల రవాణా ఛార్జీలను పెంచేస్తోన్నారు. ఫలితంగా- సరుకుల రవాణాతో ముడిపడి ఉన్న అన్ని నిత్యావసర సరుకులు, వ్యవసాయోత్పత్తులు, పాలు, వంటనూనె.. ఇలా దాదాపు సామాన్యుడి ప్రాథమిక అవసరాలకు సంబంధించిన ఆహార వస్తువుల రేట్లు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. రవాణా ఛార్జీల భారాన్ని తట్టుకోవడానికి మదర్ డెయిరీ.. తన పాల రేట్లను పెంచేసింది. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచింది. పెంచిన పాల రేట్లు ఆదివారం అమల్లోకి వస్తాయని తెలిపింది.

35 లక్షల లీటర్ల పాలు
దేశవ్యాప్తంగా రోజూ 35 లక్షల లీటర్లకు పైగా మదర్ డెయిరీ పాలు విక్రయమౌతోన్నాయి. ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కత, నాగ్‌పూర్, బెంగళూరు వంటి నగరాల్లో లీడింగ్ మిల్క్ వెండార్‌గా ఉంటోంది మదర్ డెయిరీ. ఢిల్లీ-ఎన్సీఆర్ 25 లక్షల వరకు మదర్ డెయిరీ పాలు విక్రయమౌతోన్నాయి. ఈ స్థాయిలో పాలను రవాణా చేయడానికి అవసరమైన ఛార్జీల భారం అధికమౌతోందని, ఉత్పత్తి వ్యయం తడిచి మోపెడవుతోందని మదర్ డెయిరీ తెలిపింది. నాలుగు వారాల్లో ఉత్పాదక వ్యయం నాలుగు శాతం మేర పెరిగిందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పాల రేట్లను పెంచాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

సవరించిన రేట్లివీ..
సవరించిన రేట్ల ప్రకారం.. బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) లీటర్ ఒక్కింటికి 44 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం ఈరకం పాల ధర 42 రూపాయలు ఉంటోంది. ఆదివారం నుంచి 44 రూపాయలకు చేరుతుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ 55 నుంచి 57 రూపాయలు, ఫుల్ క్రీమ్ ప్రీమియం మిల్క్-అర్ధ లీటరు 30 నుంచి 31 రూపాయలు, టోన్డ్ మిల్క్- లీటర్ ఒక్కింటికి 45 నుంచి 47 రూపాయలు, డబుల్ టోన్డ్ మిల్క్- లీటర్ 39 నుంచి 41 రూపాయలకు పెరిగింది. ఆవు పాలు లీటర్ 47 నుంచి 49 రూపాయలు, సూపర్-టీ మిల్క్ అర్ధలీటర్ 25 నుంచి 26 రూపాయలు, స్టాండరైజ్డ్ మిల్క్- లీటర్ 49 నుంచి 51 రూపాయలకు పెరిగింది. పెరిగిన రేట్లన్నీ రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications