కరోనా మహమ్మారి తగ్గిపోవడంతో ఇప్పుడు కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను ప్రారంభించాయి. కొన్ని కంపెనీలు క్రమంగా వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు మరలుతున్నాయి. అయితే పలు కంపెనీల్లో ఉద్యోగులు పూర్తి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు ఆసక్తి చూపడం లేదు. ప్రతి రోజు కార్యాలయానికి రమ్మంటే కొత్త ఉద్యోగం వెతుక్కుంటామని చెబుతున్నారు. అంతర్జాతీయవ్యాప్తంగా చాలామంది ఉద్యోగుల్లో ఇదే వైఖరి ఉంది.
ఈ మేరకు ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదిక తెలిపింది. పీపుల్ ఎట్ వర్క్ 2022, ఏ గ్లోబల్ వర్క్ ఫోర్స్ వ్యూ పేరిట సంస్థ నివేదికను విడుదల చేసింది. ప్రతి రోజు కార్యాలయానికి వచ్చి పని చేయడానికి 25 ఏళ్ల నుండి 34 ఏళ్లు కలిగిన యువకులు అంతగా ఆసక్తి చూపించడం లేదట. ప్రతిరోజు ఆఫీస్‌కు రమ్మంటే ఉద్యోగం మారేందుకు సిద్ధమని కంపెనీలకు చెబుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. కంపెనీలు పూర్తిస్థాయిలో ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

కంపెనీలు కార్యాలయానికి రావాల్సిందిగా పట్టుబడితే ఉద్యోగం మారుతాని 18 ఏళ్ల నుండి 24 ఏళ్ల వారిలో 71 శాతం మంది చెబితే, 25 ఏళ్ల నుండి 34 ఏళ్ల వయస్సు కలిగిన వారు 66 శాతం మంది, 45 ఏళ్ల నుండి 54 ఏళ్ల మధ్య వారు 56 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా 64 శాతం మంది ఉద్యోగులు... పూర్తిగా కార్యాలయానికి రమ్మంటే ఉద్యోగం మారుతామని చెప్పారు. భారత్‌లో ఇది మరింత ఎక్కువగా (76.38 శాతం) ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications