Dawood News: ఇటీవలి కాలంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. ఇటీవల ఇండియాస్ మోట్స్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న దావూద్‌పై పాకిస్థాన్‌లో విష ప్రయోగం జరిగినట్లు వార్తలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
తాజాగా మహారాష్ట్రలోని దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తుల వేలం జనవరి 5న జరుగుతోంది. రత్నగిరి జిల్లాలోని ముంబాకే గ్రామంలో దావూద్ ఇబ్రహీం తల్లి అమీనా బీ పేరిట ఉన్న నాలుగు వ్యవసాయ ఆస్తులను SAFEMA అధికారులు వేలం వేయనున్నారు. ఈ నాలుగు ప్రాపర్టీల మెుత్తం రిజర్వ్ ధర రూ.19.2 లక్షలుగా నిర్ణయించబడింది. అలాగే చిన్న ప్లాట్ రేటు రూ.15,440గా రిజర్వ్ చేశారు.

దీనికి ముందు సైతం అండర్ వరల్డ్ డాన్ ఆస్తుల వేలం జరిగింది. దావూద్ ఇబ్రహీం, అతని బంధువులకు చెందిన 11 ఆస్తులను గత తొమ్మిదేళ్లలో SAFEMA విజయవంతంగా వేలం వేసింది. ఆస్తుల విక్రయాన్ని మూడు పద్ధతుల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఒకటి ఈ-వేల కాగా రెండవది బహిరంగ వేలం, చివరగా మూసివున్న ఎన్వలప్‌లో టెండర్ పద్ధతులను అధికారులు పూర్తి చేయనున్నారు.
పాకిస్థాన్ అడ్డాగా దందాలు, అక్రమ వ్యాపారాలను నడుపుతున్న దావూద్ అనేక చట్టవిరుద్దమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. దీంతో వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి భార్య మెహజబీన్, సోదరుడు అనీస్ సహకారంతో నడుపుతున్నాడు. 1980-90 మధ్య కాలంలో దావూద్ వ్యభిచారం, డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వ్యాపారాలతో కోట్లు గడించాడు. అలాగే ప్రపంచ ఉగ్రవాద సంస్థ D కంపెనీకి అధిపతిగా మారాడు. 2015లో అతని ఆస్తుల నికర విలువ 6.7 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం అప్పట్లోనే రూ.55 వేల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఆస్తులను బినామీల పేర్లపై కూడబెట్టినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications