For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Edible Oil: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు..

|

గత కొద్ది నెలలుగా ఆకాశాన్ని తాకిన వంట నూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వ చర్యలతో రిటైల్‌ మార్కెట్‌లో వంట నూనెల ధరల తగ్గాయి.పెరుగుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరలను అరికట్టేందుకు, భారత ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో పలు కంపెనీలు ధరలు తగ్గించాయి.

20 రోజుల క్రితం అదానీ విల్మర్‌, మదర్‌ డైరీ పలు రకాల వంట నూనెలపై రూ. 10 నుంచి రూ.15 వరకు తగ్గించాయి. దీంతో రిటైల్ మార్కట్ లో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ కు రూ.175 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. అటు సోయా ఆయిల్ ధర కూడా తగ్గింది.

Most edible oil mills shut, stocks of oilseeds almost exhausted

జూన్‌లో ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం 35 నుంచి 55 శాతం ఉండగా, అప్పటి నుంచి ప్రభుత్వం క్రమంగా దిగుమతి సుంకాన్ని తగ్గించిందని, ప్రస్తుతం వివిధ ఎడిబుల్ ఆయిల్‌లపై జీరో శాతం నుంచి 15 శాతం వరకు ఉంది. ప్రస్తుతం దిగుమతి చేసుకున్న పామాయిల్ ధరలు 15 కిలోలకు స్థానికంగా రూ.2700, వేరుశెనగ, పత్తివిత్తనాలు రూ.2550 ఉన్నాయి.

భారత్ దాదాపు 13-13.5 మిలియన్ టన్నుల ఎడిబుల్ ఆయిల్‌లను దిగుమతి చేసుకుంటుంది. అందులో దాదాపు 8-8.5 మిలియన్ టన్నులు (సుమారు 63 శాతం) పామాయిల్ ఉండగా.. మిగతాది సన్‌ఫ్లవర్ ఆయిల్. వంట నూనెల ధరలు తగ్గడంతో ఆహార ద్రవ్యోల్భణం తగ్గే అవకాశం ఉంది.

English summary

Edible Oil: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు.. | Most edible oil mills shut, stocks of oilseeds almost exhausted

Sticky food inflation will likely moderate in the near term on eased domestic supplies and softening prices of key edible oils.
Story first published: Sunday, July 3, 2022, 12:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X