Mutual Funds news: సాంప్రదాయ పెట్టుబడి సాధనాలైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారాన్ని వదిలిపెట్టి ప్రజలు క్రమంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చారిత్రకంగా అత్యధిక రిటర్నులు కలిగి ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ఫన్ హౌస్ లు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమపై పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేసేందుకు స్టాక్ సెలక్షన్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఈ క్రమంలో ఎక్కువ స్టేబుల్ గా ఉండే లార్జ్ క్యాప్ స్టాక్ లతోపాటు మిడ్ మరీ ముఖ్యంగా స్మాల్ క్యాప్ లకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. లార్జ్ మరియు మిడ్ క్యాప్లతో పోలిస్తే స్మాల్ క్యాప్ స్టాక్స్ అత్యధిక రిటర్న్స్ ఇస్తుండటంతో వాటికి ప్రాముఖ్యత పెరుగుతూ పోతోంది. వీటిలోనూ ఏవి పడితే అవి కాకుండా కొన్ని సెలెక్టెడ్ స్మాల్ క్యాప్స్ స్టాక్స్‌ను మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేయడం గమనించవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు ఆ స్మాల్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు గణించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మల్టీ అసెల్ అల్లకేషన్ ఫండ్స్ అనేవి ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వండి వివిధ కేటగిరిల్లో ఇన్వెస్ట్ చేస్తూ పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందించేవిగా పేరుగాంచాయి. వీటి పెట్టుబడి విధానాన్ని గమనిస్తే కొన్ని కామన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చూడవచ్చు. ఇవి అత్యధిక రిటర్నులు జనరేట్ చేస్తూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక డెట్ మరియు బంగారాలు మార్కెట్ పడిపోతున్న వేళ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. దాదాపు ప్రతి MAAF హోల్డ్ చేస్తున్న స్మాల్ స్టాక్స్ ఇలా ఉన్నాయి.
బ్యాంకింగ్ సెక్టార్ లోని RBL బ్యాంకులో అత్యధికంగా 5 MAAFలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. IT రంగానికి చెందిన జెన్సర్ టెక్నాలజీస్, ఫార్మా విభాగంలోని సనోఫీ ఇండియా, పర్సనల్ కేర్ కు సంబంధించిన ఇమామీలో 4 మల్టీ అసెట్ ఫండ్స్ పెట్టుబడి పెడుతున్నాయి. వీటికి తోడు రియాల్టీ రంగంలోని బ్రిగెడ్ ఎంటర్ప్రైజెస్, విద్యుత్ పంపిణఈ విభాగంలోని కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్, CIE ఆటోమోటివ్, మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, PVRలలో మరో 4 చొప్పున ఇన్వెస్ట్ చేశాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications