మార్ట్‌గేజ్ కంపెనీలో భారీగా లేఆఫ్స్.. గతంలోనూ జూమ్‌కాల్ ద్వారా ఉద్యోగులకు ఉద్వాసన
Layoffs: 'లేఆఫ్స్' పేరు వింటుంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు. గతంలో కేవలం IT కంపెనీలకే పరిమితమైన ఈ పేరు, ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలనూ వణికిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మందగమనం పేరిట ఉద్యోగులపై వేటు వేస్తూ, ఖర్చులు తగ్గించుకుంటూనే ఆదాయం పెంచుకుంటున్నాయి. తాజాగా బెటర్.కాం 4 వేల మందికి ఉద్వాసన పలికడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
బెటర్.కాం CEO విశాల్ గార్గ్ జూమ్ కాల్ ద్వారా ఉద్యోగులను తొలగించిన నెలరోజుల్లోనే కంపెనీలో మళ్లీ లేఆఫ్‌లు ప్రారంభమైనట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇప్పటివరకు US మరియు ఇండియాలో దాదాపు 4 వేల మందిని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు CEO ప్రకటించారని తెలుస్తోంది. ఈ మేరకు టెక్లూజివ్ (TECHLUSIVE) నివేదించింది.

తాజా తొలగింంపుల రౌండ్‌లో బెటర్.కాం తన మొత్తం రియల్ ఎస్టేట్ బృందాన్ని తొలగించినట్లు టెక్లూజివ్ తెలిపింది. తమ యూనిట్‌ను కూడా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే ఈ దఫా ఉద్యోగాల కోతలో ఎంత మందికి పింక్ స్లిప్‌లు ఇచ్చారో మాత్రం స్పష్టంగా తెలియచేయలేదు. ఈ మార్ట్‌గేజ్ సంస్థ సైతం ఇన్-హౌస్ నుంచి భాగస్వామ్య ఏజెంట్ మోడల్‌కు మారాలని యోచిస్తున్నట్లు మీడియా నివేదికలు కూడా స్పష్టం చేశాయి.
కొన్ని నెలల క్రితం బెటర్.కాం CEO విశాల్ గార్గ్ జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. ఏడాది తరువాత కంపెనీ ప్రతి ఒక్కరికీ స్వచ్ఛందంగా నిష్క్రమించడానికి లేదా తొలగించబడటానికి ఒక ఆప్షన్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా 4 వేల మంది వరకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications