GDP: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి GDP వృద్ధి, RBI వడ్డీ రేట్ల గురించి ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ కీలక నివేదిక విడుదల చేసింది. గతేడాది ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పున:ప్రారంభం కావడం, వినియోగంలో పునరుద్ధరణ, పెరిగిన ప్రైవేట్ సెక్టార్ క్యాపెక్స్, ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల ఫలితంగా FY24లో భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) 6.2 శాతం వృద్ధి చెందుతుందని ఒక నివేదికలో పేర్కొంది.
ద్రవ్యోల్బణం అంచనాలు మెరుగుపడినందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్జీ రేట్ల తగ్గింపు ముందుగానే ప్రారంభమవుతుందని మోర్గాన్ స్టాన్లీకి చెందిన ఉపాసనా చచ్రా మరియు బని గంభీర్ అభిప్రాయపడ్డారు. 2024లో రెండవ త్రైమాసికం నాటికి దేశంలో ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు. 2023 క్యాలెండర్ సంవత్సరంలోనూ రెపో రేటు నిలిపివేయబడతుందని అంచనా వేశారు.

స్థిరమైన దేశీయ డిమాండ్ కు కాపెక్స్ లో పికప్ కీలకం కాగా.. ఇది మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడుతుందని నివేదిక వెల్లడించింది. తద్వారా ఆదాయం, పొదుపుల్లో పెరుగుదలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది. వృద్ధికి అవకాశం ఉండటంతో పెట్టుబడులు సైతం పెద్ద మొత్తంలో రావచ్చని భావిస్తోంది.

మార్చి నెలకు సంబంధించి హెడ్ లైన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ప్రస్తుతం ఏప్రిల్ లో ద్రవ్యోల్బణం 4.7 శాతం ఉండగా.. జూన్ తో ముగిసే త్రైమాసికంలోలోనూ 5 శాతం కంటే కిందే ఉంటుందని తెలిపింది. అనుకూల బేస్ ఎఫెక్ట్ మరియు కమోడిటీ ధరలను మోడరేట్ చేయగలదని భావిస్తున్నట్లు వెల్లడించింది. అయితే FY24na సగటున ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications