Gold: బంగారం ఇంకా పెరిగే అవకాశం.. మోర్గాన్ స్టాన్లీ సంచలన నివేదిక..!

బంగారం ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగిందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. వచ్చే ఏడాది పసిడి ధర ఔన్సుకు 5,000 డాలర్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ధరల పెరుగుదల క్రమంలో ఒడిదుడుకులు ఉంటాయని పేర్కొంది. "బంగారం మా నాలుగో త్రైమాసిక అంచనా అయిన ఔన్సుకు $4,450ను ఊహించిన దానికంటే వేగంగా చేరుకుంది" అని విశ్లేషకురాలు అమీ గోవర్ పేర్కొన్నారు. 2027లో బంగారం ధర ఔన్సుకు $5,000 కంటే ఎక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుందని అంచనా వేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం తక్కువగా ఉండటం వల్ల ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF) డిమాండ్ పుంజుకుందని వివరించారు.

మే, జూన్‌లలో 93 టన్నుల నిధులు బయటకు వెళ్లిన తర్వాత జూలై, ఆగస్టులలో 70 మెట్రిక్ టన్నులు అదనంగా చేరాయని మెర్గాన్ స్టాన్లీ గుర్తు చేశారు. మోర్గాన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు 2026 వరకు ఫెడ్ యథాతథంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా తగ్గిన ధరలను ఉపయోగించుకుని తమ రిజర్వులను పెంచుకున్నాయని ఆ బ్యాంక్ తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు చైనా 60 టన్నుల బంగారం కొనుగోలు చేసిందని తెలిపింది. ఇది 2023 తర్వాత అత్యధికం. అలాగే పోలాండ్ 82 టన్నుల పసిడి కొనుగోలు చేసి తన నిల్వలను 632 టన్నులకు చేర్చుకుంది. దీర్ఘకాలిక వాస్తవ దిగుబడుల నుంచి బంగారం విడిపోవడం ప్రారంభించిందని, దీర్ఘకాలిక దిగుబడులు స్థిరంగా ఉన్నప్పటికీ ఆగస్టు ప్రారంభంలో దాని ధర పెరిగిందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.

Gold

రాబోయే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఏప్రిల్ 2020 తర్వాత అత్యల్ప స్థాయికి చేరిన కామెక్స్ షార్ట్ పొజిషనింగ్ వంటివి రిస్క్‌లలో ఉన్నాయిని వివరించింది. దీర్ఘకాలిక ప్రభుత్వ రుణాల బైబ్యాక్‌లను కనీసం రెట్టింపు చేయాలన్న ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రణాళిక ఫలితంగా ఈ ర్యాలీ చోటుచేసుకుందని తెలిపింది. ఈ చర్యలతో మంగళవారం డాలర్‌ను దాదపు 1% తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర పెరిగినప్పటికీ జనవరిలో నమోదైన దాదాపు $5,600 రికార్డు స్థాయి కంటే బంగారం ఇప్పటికీ తక్కువగానే ఉందని మోర్గాన్ స్టాన్లీ గుర్తు చేసింది. బలహీనపడుతున్న డాలర్, పెరుగుతున్న అమెరికా రుణ ఆందోళనల కారణంగా పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం పరుగులు తీస్తుండటంతో పసిడి ధరలు పెరుగుతున్నట్లు అంచనా వేసింది.

ఆగస్ట్ నెల 1999 తర్వాత ఈ లోహానికి ఇదే అత్యంత బలమైన నెలగా నిలిచిందని తెలిపింది. దీర్ఘకాలిక ట్రెజరీ బాండ్లలో అమ్మకాలను స్థిరీకరించడానికి, 10 నుంచి 30 సంవత్సరాల ప్రభుత్వ రుణాల బైబ్యాక్‌లను కనీసం రెట్టింపు చేస్తామని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ బుధవారం ప్రకటించిన తర్వాత ఈ ర్యాలీ వేగం పుంజుకుంది. ఈ చర్య మొదట్లో ఈల్డ్స్‌ను కొద్దిగా తగ్గించిందని, తర్వాత అవి మళ్లీ పుంజుకుని, అంతకంటే ఎక్కువగా పెరిగాయని వివరించింది. అమెరికా ప్రభుత్వ రుణం మొదటిసారిగా $40 ట్రిలియన్ల మార్కును దాటిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం బైబ్యాక్ నిర్ణయం తీసుకుందని పేర్కొంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+