Morgan Stanley: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు రానున్న 6 నెలల కాలంలో రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల చూపు ప్రస్తుతం ఈ అంశంపైనే కేంద్రీకృతమై ఉంది.
ఈ క్రమంలోనే భారత స్టాక్ మార్కెట్లపై ప్రఖ్యాత రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికను ప్రచురించింది. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం 2024లో వస్తున్న సార్వత్రిక ఎన్నికలు 3.7 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్ మార్కెట్లలోని ప్రశాంతతకు భంగం కలిగిస్తాయని పేర్కొంది. రేటింగ్ సంస్థ అంచనాల ప్రకారం దేశీయ స్టాక్స్ పెరుగుతాయని అంచనా వేయబడింది.

అయితే ఇన్వెస్టర్ల అంచనాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెలువడితే భారత స్టాక్ మార్కెట్లు దాదాపు 30 శాతం వరకు కుప్పకూలతాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. వాస్తవానికి భారతీయ స్టాక్‌లు ఈ సంవత్సరం సుమారు 7% పెరిగాయి. ఆసియాతో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోని సహచర దేశాల కంటే మెరుగైన ఆదాయ వృద్ధి, ఆర్థిక పనితీరును కనబరచటం ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షించింది. ఈ క్రమంలో ఇండియా విక్స్ ఏడాది కాలంలో ఇప్పటి వరకు 25 శాతం మేర క్షీణించి దాని చారిత్రక కనిష్ట స్థాయికి చేరుకుంది.
ఒకవేళ రానున్న ఎన్నికల్లో ప్రభుత్వంలో మార్పు వస్తే అది విధాన సంస్కరణల దిశలో మార్పులకు దారితీస్తుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ఇది పరోక్షంగా పేలవమైన పెట్టుబడి సెంటిమెంట్లను ప్రేరేపిస్తుందని తన నివేదికలో భారత స్టాక్ మార్కెట్ల గురించి పేర్కొంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీచే ఏర్పాటు చేయబడిన మెజారిటీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో విజేతగా ఊహిస్తుంది.


Click it and Unblock the Notifications