Ashok Leyland: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, ఇతర ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. భారత ప్రభుత్వం సైతం వీటిని ప్రోత్సహిస్తున్న వేళ ఈవీ వాహనాల ఉత్పత్తి కంపెనీల షేర్లు ఇటీవలి కాలంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థలు, స్టాక్ మార్కెట్ నిపుణులు సైతం ఈ కేటగిరీ షేర్లపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు.
ఆటో మేజర్ అశోక్ లేలాండ్ షేర్లు గురువారం తమ 52 వారాల గరిష్ఠమైన రూ.259 స్థాయిని చేరుకున్నాయి. అయితే ఆ తర్వాత శుక్రవారం ధర స్వల్పంగా తగ్గి ఒక్కో షేరు ధర రూ.250.45 ఎన్ఎస్ఈలో వద్ద స్థిరపడ్డాయి. గడచిన ఆరు నెలల్లో కంపెనీ షేర్లు 43 శాతానికి పైగా వృద్ధిని చూశాయి. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కంపెనీ షేర్లకు 'టాక్టికల్ బై' ట్యాగ్ అందించింది. వ్యూహాత్మకంగా కంపెనీ షేర్లు కొనదగినవిగా బ్రోకరేజ్ పేర్కొంది.

మోర్గాన్ స్టాన్లీ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.284గా సూచిస్తూ 'ఓవర్ వెయిట్' రేటింగ్ ఇచ్చింది. రానున్న 60 రోజుల్లో అశోక్ లేలాండ్ షేర్ ధర పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. మోర్గాన్ స్టాన్లీ వాణిజ్య వాహన రంగం స్వల్ప క్షీణతను చూస్తోంది. పరిశ్రమ మార్జిన్ మెరుగుదలపై దృష్టి సారిస్తుంది. ధరలు పెరగడం, కమోడిటీ ఖర్చులు తగ్గడం, ఆటోమొబైల్యేతర వ్యాపారాల్లో వృద్ధి వంటి అంశాలు మార్జిన్లను పెంచుతాయని బ్రోకరేజ్ అంచనా వేసింది.
కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మొత్తం విక్రయాలు జూలైలో 8 శాతం క్షీణించి 13,928 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో 15,068 యూనిట్లను కంపెనీ విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 14,207 యూనిట్లు విక్రయించగా, జూలైలో దేశీయ మార్కెట్ విక్రయాలు 9 శాతం క్షీణించి 12,926 యూనిట్లకు చేరుకున్నాయని అశోక్ లేలాండ్ వెల్లడించింది. వాస్తవానికి శుక్రవారం మార్కెట్లలో కంపెనీ షేర్లు నష్టపోవటానికి కారణం సైతం జూలై త్రైమాసిక ఫలితాలు ఊహించిన స్థాయిలో లేకపోవటమేనని వెల్లడైంది.
కంపెనీ ఉత్తర్‌ప్రదేశ్ లక్నో సమీపంలో గ్రీన్ ఫీల్డ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని నిర్మించేందుకు 70 ఎకరాల స్థలాన్ని సైతం ఈ ఏడాది అక్కడి ప్రభుత్వం నుంచి పొందింది. ఇక్క విద్యుత్ బస్సులను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రారంభంలో ఏడాదికి 2,500 బస్సుల ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పనున్నట్లు చెప్పగా తర్వాతి కాలంలో దానిని 5000 వాహనాలకు పెంచనున్నట్లు అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ధీరజ్ హిందుజా అన్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications