Indigo Flights: దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థకు చెందిన దాదాపు 55 శాతం దేశీయ విమానాలు శనివారం ఆలస్యంగా నడిచాయి. కంపెనీకి చెందిన ఎక్కువగా మంది సిబ్బంది ఒకేసారి మెడికల్ లీవ్ తీసుకుని టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కి వెళ్లారు. సిబ్బంది అంతా అనారోగ్యం పేరుతో సెలవు తీసుకుని ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో రెండవ రౌండ్ జూలై 2న జరిగినట్లు వర్గాలు తెలిపాయి. మెడికల్ లీవ్ తీసుకొని ఇండిగోలోని చాలా మంది సిబ్బంది కొత్త ఉపాధి కోసం అక్కడికి చేరుకున్నారు. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా రోజువారీగా 1,600 విమానాలను నడుపుతోంది.
900 విమానాలు ఆలస్యంగా..
ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా 900 విమానాలు ఆలస్యంగా ప్రయాణించాల్సి వచ్చింది. సిబ్బంది అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. శనివారం కేవలం 45 శాతం ఇండిగో విమానాలు మాత్రమే సమయానికి నడపబడ్డాయి. పెద్ద సంఖ్యలో సిబ్బంది సిక్ లీవ్ తీసుకొని ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు బయలుదేరారని పీటీఐ వార్త సంస్థ తన కథనంలో తెలిపింది. పరిశ్రమకు చెందిన ఒక అధికారి వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "ఎయిర్ ఇండియా రెండవ దశ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ శనివారం జరిగింది. చాలా మంది ఇండిగో క్యాబిన్ సిబ్బంది సిక్ లీవ్ తీసుకుని దాని కోసం వెళ్లారు" అని తెలిపారు. విమాన సేవలు ఆలస్యంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.

ఏఏ విమానాలు ఆలస్యం అయ్యాయంటే..
ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, విస్తారా, గోఫస్ట్, ఎయిర్‌ఏషియా ఇండియా వరుసగా 77.1%, 80.4%, 86.3%, 88%, 92.3% విమానాలను సమయానికి నడిపాయి. గత ఏడాది అక్టోబర్ 8న ఎయిర్‌లైన్ బిడ్‌ను విజయవంతంగా గెలుచుకున్న టాటా గ్రూప్ జనవరి 27న ఎయిర్ ఇండియా నియంత్రణను చేపట్టింది. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసి సేవలను మెరుగుపరచాలని యోచిస్తున్న ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది.
వివరణ కోరిన DGCA:
భారీగా విమానాల ప్రయాణాల్లో జాప్యంపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగోను వివరణ కోరింది.DGCA అధికారి మాట్లాడుతూ.. "డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగోపై, దేశవ్యాప్తంగా విమానయాన సంస్థ విమానాలను ఆలస్యంపై వివరణ కోరడం జరిగింది" అని తెలిపారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications