కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఉద్యోగాల కొత ఐటి పరిశ్రమను కూడా తాకింది. పరిస్థితులు కోవిడ్ నుండి సాధారణ స్థాయికి వచ్చాక కూడా ఉద్యోగాల కోతలు వెంటాడుతూనే ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాదు మరోవైపు గత ఏడాది కాలంలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో 10,000 మందికి పైగా ఉద్యోగులు వారి ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు వెల్లడైంది. ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన నివేదిక ప్రకారం, అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ టెక్నాలజీ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల సంఖ్య 10,700 అని తెలిపింది. మరోవైపు కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.
దీనికి సంబంధించి కాగ్నిజెంట్ ఈ సంవత్సరం అంతా కొత్త ఉద్యోగులను నియమించుకుంటుందని ఓ ముఖ్య ఆర్థిక అధికారి తెలిపారు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,800. గత 12 నెలల్లో పోల్చి చూస్తే కాగ్నిజెంట్ నుండి రాజీనామా చేసిన వారి సంఖ్య 15.9 శాతం. అంతేకాదు కంపెనీ యుటిలైజేషన్ రేటు 2 శాతం పాయింట్లు తగ్గి 82%కి చేరుకుంది. అయితే, 2024 అంతటా యుటిలైజేషన్ మెరుగుదలలు బలంగా ఉన్నాయని యాజమాన్యం హైలైట్ చేసింది.

కాగ్నిజెంట్ సీఈఓ ఏమన్నారంటే
కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ మాట్లాడుతూ, గతంలో కంపెనీని విడిచిపెట్టిన చాలా మంది ఉద్యోగులు తిరిగి కంపెనీకి వస్తున్నారని అన్నారు. గత ఏడాది 2024లోనే కాగ్నిజెంట్‌ను విడిచిపెట్టిన దాదాపు 13,000 మంది ఉద్యోగులు తిరిగి కంపెనీలో చేరారని ఆయన పేర్కొన్నారు. మరో 10,000 మంది కాగ్నిజెంట్‌లో మళ్ళీ చేరడానికి ఆసక్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడంలో మా కంపెనీ అద్భుతంగా ఉందనడంలో దీని ద్వారా తేలిందని రవికుమార్ అన్నారు. కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండగా దీని పోటీదారు యాక్సెంచర్ మాత్రం నిరంతరం కొత్త ఉద్యోగులను నియమించుకుంటోంది.
యాక్సెంచర్ ఉద్యోగుల సంఖ్య
2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో యాక్సెంచర్ 24,697 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీనితో ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 7,99,000 కు పెరిగింది. ఇదిలా ఉండగా ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలు TCS, ఇన్ఫోసిస్, HCL, విప్రో అండ్ టెక్ మహీంద్రా 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో మొత్తం 2,587 మంది ఉద్యోగులను తొలగించాయి. కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయ వృద్ధి రేటు 3.5 నుండి 6 శాతానికి పెరుగుతుందని నమ్మకంగా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications