రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నేడు జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం నిర్వహించారు. అయితే ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిలో AAC బ్లాక్‌లు, ఫోర్టిఫైడ్ రైస్, ఫ్లేవర్డ్ పాప్‌కార్న్‌లపై పన్ను రేట్ల స్పష్టత ఇచ్చారు, అయితే ఆరోగ్య అండ్ జీవిత బీమా ప్రీమియంలపై పన్ను తగ్గించే అంశం వాయిదా పడింది. ఈ అంశంపై మంత్రుల బృందం భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. 50% కంటే ఎక్కువ ఫ్లై యాష్ కంటెంట్ ఉన్న ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ (AAC) బ్లాక్‌లు HS కోడ్ 6815 కిందకు వస్తాయని అలాగే 18 శాతానికి బదులుగా 12 శాతం తక్కువ GST రేటు వర్తిస్తుందని కౌన్సిల్ అంగీకరించింది. అలాగే కంపెనీలు వాడిన కార్ల విక్రయంపై పన్నును 12% నుంచి 18%కి పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఇది EV కార్లకు కూడా వర్తిస్తుంది. అయితే వ్యక్తుల ద్వారా పాత కార్ల అమ్మకం, కొనుగోలుకు ఇది వర్తించదు.
ప్రస్తుతం EVలతో సహా అన్ని పాత, సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు ఇంకా అమ్మకాలపై 12% GST విధించబడుతుంది. వీటిలో 1200cc లేదా అంతకంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ, 4000 mm లేదా అంతకంటే ఎక్కువ పొడవు గల పెట్రోల్ వాహనాలు, 1500 cc లేదా అంతకంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ అండ్ 4000 mm పొడవు గల డీజిల్ వాహనాలు ఇంకా SUVలు ఉండవు. వీటిపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈ చార్జీలు సప్లయర్ మార్జిన్‌ను సూచించే ధరకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, కొనుగోలు ధర, అమ్మకం ధర మధ్య తేడా.

పాత, సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాలపై ఇప్పటికే 18 శాతం జీఎస్టీ ఉంది. కానీ వాటిని మార్జిన్‌తో విక్రయించినప్పుడు అలాగే కంపెనీలు వాటిని కొనుగోలు చేసి తరుగుదలని క్లెయిమ్ చేసినప్పుడు ఇది జరుగుతుంది. EV అండ్ ఇతర వాహనాల అమ్మకాలపై కూడా 18% GST వర్తిస్తుంది. ఫోర్టిఫైడ్ బియ్యంపై జిఎస్‌టి తగ్గింపు చేయాలని కౌన్సిల్ సిఫారసు చేసింది. దానిని 5 శాతానికి తగ్గించారు.
పాప్‌కార్న్‌పై ఎంత పన్ను ఉంటుందంటే
రెడీ-టు-ఈట్ పాప్‌కార్న్‌పై పన్నుకు సంబంధించి కూడా GST కౌన్సిల్ స్పష్టం చేసింది. సోర్సెస్ ప్రకారం ఉప్పు ఇంకా మసాలా దినుసులతో కలిపిన పాప్‌కార్న్‌ను ముందుగా ప్యాక్ చేసి లేబుల్‌తో కాకుండా మరేదైనా రూపంలో సరఫరా చేస్తే 5 శాతం GST ఉంటుంది. ముందుగా ప్యాక్ చేసిన ప్యాక్‌లలో ఇంకా లేబుల్‌లతో సప్లయ్ చేస్తే 12 శాతం GSTని వర్తిస్తుంది. అయితే, చక్కెరతో కలిపిన పాప్‌కార్న్ (కారామెల్ పాప్‌కార్న్ వంటివి) 18 శాతం జిఎస్‌టి వర్తిస్తుంది. అయితే కౌన్సిల్ పెండింగ్‌లో ఉన్న బీమా సంబంధిత విషయాలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ అంశంపై మంత్రుల బృందం భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు.
వోచర్ లావాదేవీలపై పన్ను
మరో ముఖ్యమైన నిర్ణయంలో వోచర్‌లకు సంబంధించిన లావాదేవీని వస్తువులు లేదా సేవలగా పరిగణించబడదని, అందువల్ల పన్ను విధించబడదని కౌన్సిల్ స్పష్టం చేసింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications