FASTag: హైదరాబాద్‌లో పార్కింగ్ ఫీజు చెల్లించకుండానే వెళ్లొచ్చు!! పెట్రోలుకు కూడా
హైదరాబాద్: టోల్ ఆపరేట్ ట్రాన్సుఫర్(TOT) కింద డిసెంబర్ 15వ తేదీ నుంచి టోల్ గేట్ వద్ద FASTagను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రయోజనకరమని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మెంబర్ (ఫైనాన్స్) ఆశీష్ శర్మ అన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ తగ్గింపు, సమయం, ఇంధనం ఆదా చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో FASTag భవిష్యత్తులో ఇతర అవసరాలకూ ఉపయోగపడనుంది....

త్వరలో ఈ సౌకర్యాలు కూడా...
పెట్రోల్, డీజిల్ పోయించుకోవచ్చు. విమానాశ్రయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజు కట్టవచ్చు. వాహన బీమా పాలసీను పునరుద్ధరించుకునే సమయంలో ప్రీమియం చెల్లించవచ్చు. ఇలా పలు రకాలుగా FASTag ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

పార్కింగ్ ఫీజు చెల్లించకుండానే...!
FASTag ద్వారా పార్కింగ్ ఫీజు చెల్లించే సదుపాయాన్ని హైదరాబాదులోని జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఐసీఐసీఐ జారీ చేసిన FASTag ఉన్న వాహనాలు ఈ విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రదేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు పార్కింగ్ ఫీజు చెల్లించే బూత్ వద్ద ఆగాల్సిన అవసరం లేదు. FASTag లైన్లో బయటకు వెళ్లిపోవచ్చు. దేశంలో తొలిసారి NHAI సహకారంతో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఐసీఐసీఐ బ్యాంకులు సంయుక్తంగా ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టాయి. తద్వారా FASTag ద్వారా ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తారు. దీంతో ఇక్కడ కూడా సమయం, ఇంధనం ఆదా అవుతుంది. అలాగే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించినట్లవుతుంది. అంతేకాదు, ఓ వాహనం ఎన్నిసార్లు ఏయే తేదీల్లో విమానాశ్రయానికి వచ్చి వెళ్లిందనే రికార్డ్ ఉంటుంది.

రోడ్ అసెట్స్ సేల్ వేగవంతం
FASTag రోడ్ అసెట్స్ సేల్‌కు కూడా వేగవంతం చేస్తోందని ఆశీష్ శర్మ అన్నారు. ఫారన్ ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారని, దీంతో గత కొన్నేళ్లుగా 88-90 వరకు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు చెప్పారు. ఫారన్ పెన్షన్ ఫండ్స్, ప్రయివేటు ఈక్విటీ ఫండ్స్ కూడా ఇండియా హైవేస్ రోడ్ అసెట్స్‌పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. TOT మోడల్‌ని తాము మూడేళ్ల క్రితం ప్రారంభించామన్నారు.


Click it and Unblock the Notifications