కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ పైన వడ్డీ (చక్ర వడ్డీ) రాయితీని నవంబర్ 2వ తేదీలోగా అమలు చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సగటు మనిషి దీపావళి పండుగ ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉందని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి వడ్డీపై వడ్డీని మినహాయింపును ఇస్తూ తీసుకున్న నిర్ణయం అమలులో ఎందుకు జాప్యం జరుగుతోందని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడన ధర్మాసనం బుధవారం కేంద్రాన్ని ప్రశ్నించింది.

అందుకే జాప్యం
వడ్డీపై వడ్డీ రద్దుకు నవంబర్ 15వ తేదీ వరకు సమయం కావాలని కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. సామాన్యులు ఆందోళనలో ఉన్నారని, వెంటనే ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నవంబర్ 2లోగా ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్రం నిర్ణించిందని, కానీ అది ఇంకా అమల్లోకి రాలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. జాప్యం ఎందుకు అని కోర్టు నిలదీసింది. దీనిపై తుషార్ మెహతా స్పందిస్తూ.. రుణాలు ఇవ్వడంలో చాలా పద్ధతులు ఉంటాయని, వీటిపై బ్యాంకులతో సంప్రదింపులు జరపాలన్నారు. దీనికి సుప్రీం స్పందిస్తూ సామాన్యుల దీపావళి మీ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించింది.

యాక్షన్ ప్లాన్ కీలకం
సామాన్యుని ఇబ్బందులు అర్థం చేసుకుంటామని, వడ్డీపై వడ్డీ భారం లేకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పడం ఆహ్వానించదగిన అంశం అని, కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, కేవలం అఫిడవిట్ మాత్రమే అందించారని, వడ్డీ రద్దు ప్రయోజనాన్ని ఎలా అందిస్తారనేది ఇప్పుడు కీలక అంశమని పేర్కొంది. రద్దు యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన ఆదేశాలు ఇచ్చారా స్పష్టం చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. రూ.2 కోట్ల వరకు ఊరటను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని సూచించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

కేంద్రం.. బ్యాంకులు రెడీ
కరోనా మారటోరియానికి సంబంధించి రుణాల వడ్డీపై వడ్డీ విధించటాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయగా రూ.2 కోట్ల లోపు రుణాలపై విధించే చక్రవడ్డీని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కాగా, కేంద్రం నిర్ణయం ఏదైనా అమలు చేసేందుకు సిద్ధమని బ్యాంక్స్ అసోసియేషన్ తరఫు సీనియర్ అడ్వోకేట్ హరీష్ సాల్వే తెలిపారు. తగిన ద్రవ్యవిధానం, ప్రతిపాదనల అమలు లేకుండా ఆయా రుణాలను ఎన్పీఏలుగా వర్గీకరించవద్దని ఇటీవల సుప్రీం కోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications