భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై మూడీస్ అనలిటిక్స్ తన అంచనాలను వెల్లడించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మాంద్యం వచ్చే అవకాశం లేదని తన అంచనాల్లో వెల్లడించింది. అయితే పెరుగుతున్న వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా వృద్ధి మందగించవచ్చని అంచనా వేసింది. 'APAC Outlook A Coming Downshift' అనే పేరుతో చేపట్టిన సర్వేలో ఈ వివరాలను వెల్లడించింది.

భారత విషయంలో..
వచ్చే ఏడాది భారత్ నెమ్మదిగా తన వృద్ధి రేటు దిశగా పయనిస్తుందని మూడీస్ లెక్కగట్టింది. ఇదే సమయంలో వ్యవసాయంలో మెరుగైన ఉత్పత్తులు, లాభాలతో పాటు అంతర్గత పెట్టుబడి అండ్ టెక్నాలజీ వృద్ధి రేటును వేగవంతం అవుతాయని నివేదించింది. అయితే ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే రిజర్వు బ్యాంక్ రెపో రేటును 6 శాతం వరకు పెంచుతుందని, దాని వల్ల దేశ జీడీపీ కుంటుపడుతుందని వెల్లడించింది.

ఆర్థిక సంవత్సరంలో..
2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 8 శాతంగా ఉంటుందని ఆగస్టులో తన అంచనాలను వెల్లడించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇది 5 శాతంగా ఉండవచ్చని మూడీస్ అంచనా వేసింది. అయితే అంతర్జాతీయ కారణాల వల్ల ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోందని తెలిపింది. వాణిజ్యంపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని ప్రభావం చూపుతోంది.

చైనా ఆర్థిక వ్యవస్థ..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఆసియాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ కూడా అక్టోబర్ నుంచి వార్షిక ప్రాతిపదికన వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎగుమతులపై కంటే దేశీయ వినియోగం, దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. చైనా మందగమనం ఆసియా పసిఫిక్ ప్రాంత వృద్ధి రేటును ప్రభావితం చేస్తోందని మూడీస్ పేర్కొంది. ఈ ప్రాంతంలో వచ్చే సంవత్సరం సైతం మాంద్యం వచ్చే అవకాశం లేదని తాము భావిస్తున్నామని వెల్లడించింది.


Click it and Unblock the Notifications