దేశ GDP వృద్ధి రేటుకు మూడీస్ భారీ కోత.. RBI అంచనాలతో పోల్చి చూస్తే మరీ దారుణం
Moody's: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఓ బ్రైట్ స్పాట్ అంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇటీవల కామెంట్ చేసిన విషయం తెలిసిందే. పలు రేటింగ్ సంస్థలు సైతం దాదాపు ఇదే విషయాన్ని ప్రకటించాయి. అయితే మారుతున్న దేశీయ, అంతర్జాతీయ సమీకరణాల దృష్ట్యా.. గతంలో ఇచ్చిన వృద్ధి అంచనాలను సవరిస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ జూన్ త్రైమాసికంలో 6 నుంచి 6.3 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు ఆశించిన దానికంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. వారం క్రితం రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన వృద్ధి అంచనా 8 శాతంతో పోలిస్తే మూడీస్ అంచనా చాలా తక్కువగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

2022-23లో సాధారణ ప్రభుత్వ రుణం GDPలో దాదాపు 81.8 శాతం ఉంటుందని ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ మేనేజింగ్ డైరెక్టర్ జీన్ ఫాంగ్ తెలిపారు. తద్వారా దేశం తక్కువ రుణ స్తోమత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. అయితే అధిక అభివృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
"ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ వృద్ధి 6 నుంచి 6.3 శాతంగా ఉంటుందని ఆశిస్తున్నాము. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నమోదైన 6.1 శాతానికి దాదాపు సమానంగా ఉంది" అని ఫాంగ్ చెప్పారు. "Baa3"-రేటెడ్ సార్వభౌమాధికారిగా భారతదేశ ఆస్తులు అధిక అభివృద్ధి సామర్థ్యంతో స్పష్టంగా ఉన్నాయన్నారు. రెండేళ్లుగా ఆర్థిక లక్ష్యాలను సాధించడం ద్వారా కొంత ఆందోళనలు తగ్గాయని పేర్కొన్నారు. 2021-22లో GDPలో 6.7 శాతం ఉన్న ప్రభుత్వ వ్యయం మరియు రాబడి మధ్య వ్యత్యాసం.. 2022-23లో 6.4 శాతానికి తగ్గడం శుభసూచకం.


Click it and Unblock the Notifications