కరోనా మహమ్మారి కారణంగా భారత వృద్ధి రేటు ఈ ఏడాది గణనీయంగా తగ్గుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ అంచనా వేసింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను భారీగా కుదించింది. వృద్ధి రేటు 2.5 శాతం వరకు ఉండొచ్చని మార్చిలో చేసిన ప్రకటనను సవరించి తాజాగా అంచనాల్ని 0.2 శాతానికి కుదించింది. వచ్చే క్యాలెండర్ ఏడాదిలో మాత్రం వృద్ధి రేటు 6.2 శాతం వరకు ఉంటుందని తెలిపింది.
గ్లోబల్ మాక్రో ఔట్ లుక్ 2020-21 (ఏప్రిల్ 2020 అప్ డేట్) పేరుతో నివేదికను విడుదల చేసింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో G-20 దేశాల వృద్ధి తగ్గుతుందని తెలిపింది. ఈ ఏడాదిలో G-20 ఆర్థిక వ్యవస్థల వృద్ధి 5.8 శాతం కుదించుకుపోవచ్చునని తెలిపింది. చైనా వృద్ధి రేటు 2020 ఏడాదికి గాను 1 శాతం ఉంటుందని మూడీస్ తెలిపింది.

ఇండియా తొలుత 21 రోజుల పాటు ప్రకటించిన లాక్ డౌన్‌ను మళ్లీ 40 రోజులకు పొడిగించిందని గుర్తు చేసింది. అయితే వ్యవసాయం సహా కొన్ని మినహాయింపులు ఇచ్చిందని పేర్కొంది. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ కూడా వృద్ధి రేటు 29 ఏళ్ల కనిష్టానికి 1.9 శాతానికి చేరుకుంటుందని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications