For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Oil Prices: వాహనదారులకు గుడ్ న్యూస్ .. దిగిరానున్న ఇంధన ధరలు.. Moody’s తాజా రిపోర్ట్

|

Oil Prices: ప్రస్తుతం చమురు ధరలు 100 డాలర్లకు దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఇంధన ధరలు ప్రపంచ వ్యాప్తంగా భారీగానే పెరిగాయి. అయితే ఇప్పుడు సామాన్యులకు ఊరటనిచ్చే వార్త ఒకటి ఉంది.

భారీగా ధరల పతనం..

భారీగా ధరల పతనం..

అంతర్జాతీయ రేటింగ్ సంస్థ Moody's తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో అందించిన వివరాల ప్రకారం.. 2024 చివరి నాటికి గ్లోబల్ చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 70 డాలర్లకు తగ్గుతాయని మూడీస్ అనలిటిక్స్ ఆసియా పసిఫిక్ (APAC) రీజియన్‌పై వెల్లడించింది.

ఉక్రెయిన్ యుద్ధంతో పెరిగిన ధర..

ఉక్రెయిన్ యుద్ధంతో పెరిగిన ధర..

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత జూన్‌లో చమురు ధరలు బ్యారెల్‌ 120 డాలర్లకు పెరిగి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వీటి ధరలు ఆగస్టులో బ్యారెల్‌ 100 డాలర్లకు తగ్గడాన్ని ఉటంకిస్తూ.. మూడీస్ అనలిటిక్ ఇలా చెప్పింది: "ఈ ధోరణి కొనసాగుతుంది; వచ్చే ఏడాది చివరి నాటికి ముడిచమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 70 డాలర్లకు తగ్గుతాయని మేము భావిస్తున్నాము." అని వెల్లడించింది. దీనివల్ల సింగపూర్, హాంకాంగ్‌ వంటి పెద్ద చమరు దిగుమతి దారులకు పెద్ద ఊరట కలగనుందని మూడీస్ అనలిటిక్స్ తెలిపింది.

 పెరిగిన గృహ ఇంధన బిల్లులు..

పెరిగిన గృహ ఇంధన బిల్లులు..

థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి ఇంధన దిగుమతి ఆధారిత దేశాలకు గృహ ఇంధన బిల్లులు బాగా పెరిగాయి. ఇదే సమయంలో కీలక ఇంధన ఎగుమతిదారులుగా ఉన్న ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియాలకు మంచి లాభాన్ని ఆర్జించాయని వెల్లడించింది.

గ్యాస్ బొగ్గు పరిస్థితి..

గ్యాస్ బొగ్గు పరిస్థితి..

కానీ బొగ్గు, సహజ వాయువు ధరలు మాత్రం అధికంగానే ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, చైనాలతో సహా APAC ప్రాంతంలోని LNG దిగుమతిదారులు ముఖ్యంగా ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా బొగ్గు ధరలు పెరగడంతో.. భారత్, పాకిస్తాన్, వియత్నాంతో సహా పెద్ద దిగుమతిదారులు తమ అవసరాల కోసం ఎక్కువ చెల్లించినట్లు రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.

 లాభపడుతున్న ఆస్ట్రేలియా..

లాభపడుతున్న ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా ఎగుమతి బూమ్‌లో ఉంది. పెరిగిన బొగ్గు, LNG ధరలు దాని వాణిజ్య నిబంధనలను రికార్డు స్థాయికి నెట్టాయి. ఇది మైనింగ్‌తో ముడిపడి ఉన్న ఆస్ట్రేలియన్ సంస్థలకు సహాయం చేయడమే కాకుండా కంపెనీ లాభాలతో పాటు ప్రభుత్వానికి అత్యధికంగా టాక్స్ ఆదాయాన్ని అందిస్తోంది. ఇదే సమయంలో ఎగుమతుల కంటే ఇంధర దిగుమతి ఖర్చులు పెరగటం సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలకు చేటుచేస్తోందని రిపోర్ట్ వెల్లడించింది. మరో పక్క రోజురోజుకూ బలపడుతున్న డాలర్, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఇతర దేశాల కరెన్సీలు పతనమౌతున్నాయి.

English summary

Oil Prices: వాహనదారులకు గుడ్ న్యూస్ .. దిగిరానున్న ఇంధన ధరలు.. Moody’s తాజా రిపోర్ట్ | Moody’s Analytics latest report says Global crude oil prices falls to 70 dollars per barrel

Global oil prices to fall to $70 per barrel Moody’s Analytics
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X