Mood of the Nation సర్వే: మందగమనం-ఉల్లి ధర.. 62% మందిది ఇదే మాట
2019-20లో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉంది. ఉల్లి, ఇతర ఫుడ్ ఐటమ్స్ ధరల పెరుగుదలనే దీనికి నిదర్శనమని ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. 28 శాతం మంది మాత్రం ఇతర కారణాలు చెప్పారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో దేశవ్యాప్తంగా 12,141 మంది పాల్గొన్నారు.

భారీగా పెరిగిన ఉల్లి, కూరగాయల ధరలు
ఇటీవల రిటైల్ ద్రవ్యోల్భణం (CPI), హోల్‌సేల్ ద్రవ్యోల్భణం (CPI) భారీగా పెరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ (2019)లో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్భణం 7.35 శాతంతో ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంది. హోల్‌సేల్ ద్రవ్యోల్భణం 2.59 శాతంతో ఎనిమిది నెలల గరిష్టానికి చేరుకుంది. డిసెంబర్ నెలలో ఉల్లి ధరలు 455 శాతం పెరిగాయి. కూరగాయల వంటి వాటి ధరలు 70 శాతం పెరిగాయి.

రూ.160కి చేరిన ఉల్లి ధరలు
ముఖ్యంగా, డిసెంబర్ 2019లో ఉల్లి ధరలు కిలో రూ.160కి చేరుకున్నాయి. ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.70 వరకు వచ్చాయి. ఉల్లి ధరలు భారీగా పెరిగిన కారణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దీంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. జనవరి నుంచి మే మధ్య ఫ్రెష్ ఆనియన్స్ మార్కెట్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఉల్లిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం భావిస్తోంది.

ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
కేంద్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ నెలలో ఉల్లి ఎగుమతులను నిషేధించింది. ధరలు పెరుగుతుండటంతో ఉల్లి లభ్యత భారత మార్కెట్లో పెంచేందుకు ఎగుమతులపై ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద స్టాక్ పరిమితులు విధించింది. అంతకుముందు ఉల్లి ధరలు ఢిల్లీ వంటి నగరాల్లో ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో జరిగిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో.. ఉల్లి ధరలు పెరగడం ఆర్థిక మందగమన ప్రభావాన్ని రిఫ్లెక్ట్ చేస్తోందని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications