మీరు అసంఘటిత రంగంలో ఉన్నారా? మీ కష్టంలో కొంత మొత్తాన్ని మీ భవిష్యత్తు కోసం లేదా రిటైర్మెంట్ కోసం వినియోగించాలని భావిస్తున్నారా? సాధారణ పౌరుల నుండి సీనియర్ సిటిజన్స్ వరకు రిస్క్ తీసుకోవడం ఇష్టపడని వారు ఎక్కువగా ప్రభుత్వరంగ సేవింగ్స్ స్కీంలలో, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. పెట్టుబడి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. ఇలాంటి పథకాల్లో ఒకటి అటల్ పెన్షన్ యోజన(APY). 2015 మే నెలలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన మంచి సోషల్ సెక్యూరిటీ స్కీం ఇది. 2017-18 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి APYలో 97 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు చేరారు. సబ్‌స్క్రైబర్స్ బేస్‌లో షార్ట్ కమింగ్స్ ఉన్నప్పటికీ అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ పొందడానికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు.

నెలకు రూ.5000 వరకు పెన్షన్
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం లక్ష్యంగా కేంద్రం తీసుకువచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ స్పాన్షర్డ్ స్కీమ్ కావడంతో బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా కలిగిన ఏ భారతీయుడైనా ఈ స్కీంలో చేరవచ్చు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు APY స్కీంలో చేరవచ్చు. ఈ స్కీంలో చేరిన సభ్యులకు నెలవారీగా రూ.1000 నుండి రూ.5000 పెన్షన్ వస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా APYని నిర్వహిస్తోంది ప్రభుత్వం. 18 ఏళ్లు దాటినవారు ప్రతి నెల రూ.42 నుండి రూ.210 కాంట్రిబ్యూషన్ చేయవచ్చు. మీ వయస్సు ఎక్కువ అవుతుంటే మీరు చెల్లించాల్సిన ప్రీమియం పెరుగుతుంది. వయస్సును బట్టి ఈ స్కీంలో చేరడానికి అర్హత ఉంటుందా లేదా తేల్చవచ్చు. సబ్‌స్క్రైబర్‌గా పేరు నమోదు చేసుకుంటే మాత్రం మీ సేవింగ్స్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డబ్బు డెబిట్ అవుతుంది.

60 ఏళ్ల తర్వాత పెన్షన్
ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ప్రయోజనం పొందవచ్చు. అంటే ఒక సబ్‌స్క్రైబర్ గరిష్టంగా 40 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తాడు. కనిష్టంగా 20 ఏళ్లు స్కీంలో కాంట్రిబ్యూట్ చేయాలి. ఇన్వెస్టర్ మృతి చెందే వరకు పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఇన్వెస్టర్ మృతి చెందితే అతని భార్యకు చనిపోయే వరకు పెన్షన్ వస్తుంది. సబ్‌స్క్రైబర్, అతని భార్య మృతి చెందితే కార్పస్ మొత్తం నామినీ అకౌంట్లోకి చేరుతుంది.

అప్పుడే ముందస్తు ఉపసంహరణ
ఆటో డెబిట్ సౌకర్యం పూర్తిగా ఆప్షనల్. ఆప్షన్‌ను ఎంచుకుంటే వడ్డీ కూడా చెల్లించాలి. నెలవారీగా, మూడు నెలలకు ఓసారి, అర్ధసంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించాలి. APY స్కీం కింద కనీసం పెన్షన్ రూ.1000 నుండి రూ.5000 వరకు పొందవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌తో పాటు మీరు ఎంచుకునే కనీస పెన్షన్ బట్టి ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు దాటితే పెన్షన్ వస్తుంది. ముందుగా స్కీం నుండి బయటకు వెళ్లిపోయే ఆప్షన్ ఉంది. అయితే మరణం, అనారోగ్యానికి గురైతే ముందస్తుగా వెళ్లడానికి అనుమతినిస్తారు.

ప్రయోజనమెంతో
APY స్కీం కింద కాంట్రిబ్యూట్ చేసినవారు నేషనల్ పెన్షన్ స్కీం మాదిరిగా బెనిఫిట్స్ పొందవచ్చు. ఐటీ చట్టంలోని 80సీసీడీ(1బీ) సెక్షన్ కింద ఈ కాంట్రిబ్యూషన్ నమోదు చేయవచ్చు. రూ.50వేల వరకు పన్ను మినహాయింపు ఉంది. ఐటీ చట్టం 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ నెల పెట్టుబడిని బట్టి నెలకు రూ.1000 నుండి రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications