కెనరా బ్యాంకు తమ కస్టమర్లకు శుభవార్తను అందించిన సంగతి విదితమే. తమ ఖాతాదారుల కోసం మినిమం బ్యాలెన్స్ ఉండాలనే నిబంధనను తీసేసింది. జూన్ 1వ తేదీనుంచి సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని బ్యాంక్ స్పష్టం చేసింది.అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు ఈ కొత్త రూల్ వర్తిస్తుందని కెనరా బ్యాంకు తెలిపింది. కాగా ఈ రకమైన సదుపాయాన్ని కల్పించిన మొదటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా కెనరా బ్యాంకు అవతరించింది.
సాధారణంగా మినిమం బ్యాలెన్స్ లేకపోతే 25 నుంచి 45 రూపాయల వరకు బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. ఈ పెనాల్టీ బ్యాంకులను బట్టీ పెరిగే తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనను ఎత్తివేస్తూ కెనరా బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఖాతాదారులకు భారీ ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే కెనరా బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో మిగతా బ్యాంకులు ఆలోచనలో పడ్డాయి. మినిమం బ్యాలెన్స్ ను తగ్గించే విధంగా ఆలోచన చేస్తున్నాయి.

ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో మినిమం బ్యాలన్స్ వివరాలను ఓ సారి పరిశీలించినట్లయితే.. భారత దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI లో మినిమం బ్యాలన్స్ నిబంధన ఏదీ లేదు. ఎస్బీఐ ఖాతాదారుల అకౌంట్లో మినిమం బ్యాలన్స్ లేకున్నా ఎటువంటి పెనాల్టీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించదు. ఇక మరో బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ విషయంలోకి వెళ్తే ..సెమీ అర్బన్ లేదా నగరాల్లో ఉన్న ఖాతాదారులకు నెలవారీ బ్యాలన్స్ రూ. 10 వేలు వరకు విధిస్తోంది. ఇక ఏడాది కాలానికి ఈ మొత్తం రూ. 50 వేల వరకు ఉంది. ఆ మేరకు అకౌంట్లో నిల్వలు లేకపోతే యాక్సిస్ బ్యాంక్ పెనాల్టీ విధిస్తుంది. ఈ పెనాల్టీ దాదాపు 6 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 1, 2023న సవరించిన టారిఫ్ ప్రకారం.. గరిష్ఠంగా ఈ పెనాల్టీ రూ. 600 వరకు ఛార్జ్ చేస్తుంది బ్యాంక్.
మరో బ్యాంక్ HDFC విషయానికి వస్తే..నగరాల్లో ఉన్న కస్టమర్లు దాదాపు నెలకు రూ. 10 వేల వరకు ఖాతాలో మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాలి. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇది రూ. 5 వేలుగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల వారికి అయితే మినిమం బ్యాలన్స్ అనేది రూ. 2500 వరకు ఉంది. ఇక మినిమం బ్యాలన్స్ మెయిటెంన్ చేయలేని వారికి FD రూపంలో అవకాశం ఇచ్చింది. నగరాల్లో లక్ష వరకు అలాగే గ్రామాల్లో రూ. 25 వేల వరకు FDని తప్పని సరి చేసింది. ఈ మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయలేని ఖాతాదారులకు పట్టణ ప్రాంతాల్లో రూ. 600 వరకు పెనాల్టీ విధిస్తోంది. అలాగే గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 300 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇక ICCI బ్యాంక్ విషయానికి వస్తే.. నగరాల్లో ఉన్న కస్టమర్లు దాదాపు నెలకు రూ. 10 వేల వరకు ఖాతాలో మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాలి.అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇది రూ. 5 వేలుగా ఉంది.ఈ బ్యాలన్స్ మెయింటెన్ చేయలేని వారికి గరిష్టంగా రూ. 450 వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. మరో బ్యాంక్ పంజాబ్ నేషనల్ విషయానికి వస్తే.. నగరాల్లో ఉన్న కస్టమర్లు దాదాపు నెలకు రూ. 2 వేల వరకు ఖాతాలో మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాలి. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇది రూ. 500 నుంచి వేయి రూపాయలుగా ఉంది. మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేని వారికి గరిష్టంగా రూ. 120 వరకు జరిమానాగా విధించే అవకాశం ఉంది.
కస్టమర్లు సంబంధిత బ్యాంకులలో నెలవారి సగటు బ్యాలన్స్ తనిఖీ చేసుకోవాలి. బ్యాంకులు ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే..ఈ ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. ఏదేమైనా బ్యాంకులు అందించే సదుపాయాల్లో ప్రధానమైనది పొదుపు ఖాతాలు ముఖ్యమైనవి. కస్టమర్లు తమ ఖాతాలో జమ చేసిన మొత్తానికి వడ్డీనిపొందవచ్చు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications