కేవలం వెయ్యి రూపాయల SIP తో లక్షాధికారి అవ్వడం ఎలా? ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలో తెలుసా?

మ్యూచువల్ ఫండ్స్‌ (Mutual Funds) లో పెట్టుబడి పెట్టడానికి మార్కెట్లో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కానీ, సామాన్య , మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడేది మాత్రం "సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్" (SIP) నే! ఎందుకంటే ఇందులో ఒకేసారి భారీ మొత్తంలో కాకుండా, ప్రతి నెలా మనకు నచ్చిన చిన్న మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో దాచుకునే వెసులుబాటు ఉంటుంది. మరి ప్రతి నెలా కేవలం రూ. 1,000 చొప్పున ఎస్‌ఐపీ (SIP) చేయడం ద్వారా రూ. 1 లక్షల నిధిని (Corpus) ఎలా సమకూర్చుకోవచ్చు? దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో పూర్తి లెక్కలతో ఇప్పుడు చూద్దాం.

Monthly 1000 SIP Lakhpati Calculation Mutual Funds Compounding Benefits

ఎస్‌ఐపీ (SIP) లైవ్ కాలిక్యులేషన్..

మీరు ప్రతి నెలా రూ. 1,000 పొదుపు చేస్తూ, సగటున 12 శాతం వార్షిక రిటర్న్స్ (Returns) ఆశించినట్లయితే.. రూ. 1 లక్ష మార్కును అందుకోవడానికి మీకు సుమారు 6 సంవత్సరాల సమయం పడుతుంది.

  • నెలకు పెట్టుబడి: రూ. 1,000
  • మొత్తం కాలపరిమితి: 6 సంవత్సరాలు (72 నెలలు)
  • మీరు జేబు నుండి పెట్టే అసలు: రూ. 72,000
  • అంచనా రిటర్న్స్ (12% వడ్డీతో): రూ. 34,000
  • 6 ఏళ్ల తర్వాత మొత్తం ఫండ్ విలువ: రూ. 1,06,000

అంటే మీరు దాచిన రూ. 72 వేల అసలు కాస్తా, వడ్డీతో కలిసి 6 ఏళ్లలో రూ. 1.06 లక్షల భారీ నిధిగా మారుతుంది. ఇదీ ఎస్‌ఐపీ లో ఉండే అసలైన మ్యాజిక్!

ఎస్‌ఐపీ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే టాప్ 3 బెనిఫిట్స్..

మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్‌ఐపీ ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల కేవలం లాభాలే కాకుండా ఇన్వెస్టర్లకు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

  1. పెట్టుబడి పెట్టే ఫ్లెక్సిబిలిటీ (Investment Flexibility: ఎస్‌ఐపీ లో మీ ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టుబడి పెట్టే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎస్‌ఐపీ అమౌంట్‌ను పెంచుకోవచ్చు (Step-up), ఒకవేళ ఇబ్బందులు ఉంటే తగ్గించుకోవచ్చు లేదా కొన్ని నెలల పాటు నిలిపివేయవచ్చు కూడా.
  2. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ (The Power of Compounding): ఎస్‌ఐపీ కి ఉన్న అతిపెద్ద బలం చక్రవడ్డీ లెక్కింపు (Compounding). మీరు సంపాదించిన వడ్డీపై మళ్లీ వడ్డీ రావడం దీని ప్రత్యేకత. మీరు ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో పెట్టుబడిని కొనసాగిస్తే.. ఈ కాంపౌండింగ్ పవర్ వల్ల మీ డబ్బు అంత వేగంగా, ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
  3. అపరిమిత పెట్టుబడి అవకాశం (Unlimited Potential): ఎస్‌ఐపీ లో గరిష్ట పెట్టుబడికి ఎలాంటి లిమిట్ లేదు. మీ స్తోమతను బట్టి ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే, మార్కెట్లో కొన్ని ఫండ్స్ అయితే కేవలం రూ. 100 కనీస పెట్టుబడితోనే ఎస్‌ఐపీ (SIP) ని ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

చిన్న వయసు నుండే ఇలాంటి క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలను చాలా సులభంగా చేరుకోవచ్చు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+