UPI: కార్డు లేకుండానే ATM నుంచి మనీ విత్‌డ్రా.. UPIని ఇలా వాడేయండి మరి!
UPI: నగదు డ్రా చేయాలన్నా, ఎవరికైనా పంపించాలన్నా గతంలో బ్యాంకుల వద్దకు పరుగెత్తాల్సి వచ్చేది. పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకింగ్ సేవలు అరచేతిలోనికి వచ్చేశాయి. ఇక UPI సేవలు అందుబాటులోకి రావడంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఓ రేంజ్ కు వెళ్లాయి. సింగిల్ క్లిక్ తో అన్ని రకాల సేవలను వినియోగించుకునే అవకాశం లభిస్తోంది.
ఇప్పటి వరకు కేవలం పేమెంట్స్, నగదు బదిలీకి మాత్రమే వినియోగిస్తున్న UPI సర్వీసును ఉపయోగించి.. ATMల నుంచి డబ్బు సైతం విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. నాన్-బ్యాంకింగ్ గంటలలో ATMల ద్వారా కరెన్సీని పొందటానికి డెబిట్ కార్డ్‌లను ప్రవేశపెట్టారు. అయితే తాజా ఆవిష్కరణ ఆధారంగా కార్డులు సైతం లేకుండా నగదును ఉపసంహరించుకోవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవస్థ ప్రకారం డెబిట్ కార్డ్‌లకు బదులుగా PhonePe మరియు Paytm వంటి UPI యాప్‌లను ఉపయోగించి ATMల నుండి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.

మొదటగా బ్యాంక్ ఆఫ్ బరోడా ATMలో 'కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ'ను ఎంపిక చేసుకోవాలి. విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని టైప్ చేయాలి. ఏదైనా UPI యాప్‌తో అక్కడ చూపిస్తున్న QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బు పంపించాలి. అనంతరం 'ప్రెస్ హియర్ ఫర్ క్యాష్'పై నొక్కడంతో ATM నుంచి కరెన్సీని పొందవచ్చు. UPI ఖాతా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడితే.. డబ్బు డెబిట్ చేయాలనుకుంటున్న ఖాతాను సైతం ఎంచుకోవచ్చు. అయితే రోజువారీ ఉపసంహరణ పరిమితి 5 చొప్పున రెండు సార్లు లావాదేవీలు నిర్వహించవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులు SBI Yono లేదా Yono Lite యాప్‌లతో బ్యాంక్ ATMల నుండి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం QR క్యాష్ లేదా యోనో క్యాష్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. Yono యాప్‌ని తెరిచి 'యోనో క్యాష్'పై క్లిక్ చేసిన తర్వాత, విత్‌డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రిజిస్టర్ కాబడిన మొబైల్ నంబర్ కు 6 అంకెల పిన్, ట్రాన్సాక్షన్ నంబర్ వస్తాయి. నాలుగు గంటలలోపు SBI ATMని సందర్శించి లావాదేవీ సంఖ్య మరియు 6 అంకెల పిన్‌ను నమోదు చేయడంతో కరెన్సీని సేకరించవచ్చు.


Click it and Unblock the Notifications