Paytm News: ఒక్క మాటతో పేటీఎం స్టాక్ 9 శాతం జంప్.. నీ లక్ష్యం సూపర్ సీఈవో..
Vijay Shekhar Sharma: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లో డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం కంపెనీ షేర్లు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. అయితే దీనికి కారణం సీఈవో విజయ శేఖర శర్మ చేసిన కొన్ని కీలక కామెంట్స్ కావటం గమనార్హం. కంపెనీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను చూస్తున్నప్పటికీ శర్మ మాత్రం తన లక్ష్యాన్ని ఉన్నతంగానే ఉంచుకోవటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళితే పేటీఎంను దేశంలో 100 బిలియన్ డాలర్ల కంపెనీగా మార్చాలన్నదే తన లక్ష్యమని ఇటీవల కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఈ స్థాయి కలిగిన కంపెనీగా రిలయన్స్ ఉంది. అయితే కంపెనీపై తనకున్న అభిప్రాయం, కమిట్మెంట్ చూసిన దేశీయ ఇన్వెస్టర్లు నేడు భారీగా కొనుగోళ్లకు దిగారు. దీంతో పేటీఎం స్టాక్ ఇంట్రాడేలో ఏకంగా 9 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారంపై కఠిన ఆంక్షలతో విరుచుకుపడిన తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా 3.5 బిలియన్ డాలర్లు క్షీణించింది. గురుగ్రామ్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న శర్మ తన ప్రసంగంలో Paytm వృద్ధి గురించి ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడించారు. 2024 ప్రారంభంలో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ కంపెనీ పదునైన వృద్ధికి సిద్ధంగా ఉందని చెప్పారు. పేటీఎం బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలని తాను కోరుకుంటున్నానని ఈ క్రమంలో దానిని 00 బిలియన్ డాలర్ల భారతీయ కంపెనీగా మార్చాలనే వ్యక్తిగత ఆశయంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
అయితే తాము ఇంకా మెరుగ్గా పనిచేసి ఉంటే బాగుడేది అనే అభిప్రాయాన్ని పేటీఎంపై ఆర్బీఐ చర్యలపై శర్మ అభిప్రాయపడ్డారు. అయితే తాము ఇప్పుడు సవాళ్లను నావిగేట్ చేయడానికి చాలా బాగా సిద్ధంగా ఉన్నామని శర్మ ఇటీవలి సంక్షోభంపై స్పందించారు. ఆర్బీఐ చర్యలతో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో గణనీయమైన భాగాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో నేడు పేటీఎం కంపెనీ షేర్ల ధర మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో ఒక్కోటి 8.34 శాతం లాభపడి రూ.472.95 వద్ద స్థిరపడ్డాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.30 వేల కోట్లుగా ఉంది. గడచిన కొన్ని వారాలుగా కంపెనీ షేర్లు మెల్లగా కోలుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications