Cochin Shipyard Stock: స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ డివిడెండ్ ఆఫర్ చేసే కంపెనీల కోసం వెతుకుతూ ఉంటాయి. క్రమం తప్పకుండా రాబడులు అందించే కంపెనీలకు మార్కెట్లలో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అలాగే ఇటీవలి కాలంలో డిఫెన్స్ కంపెనీల షేర్లుపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్న వేళ ఒక కంపెనీ మాత్రం మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించిన డిఫెన్స్ కంపెనీల్లో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒకటిగా దూసుకుపోతోంది. కంపెనీ తన పెట్టుబడిదారులకు డివిడెండ్ అందించటంలో పెద్ద రికార్డును కలిగి ఉంది. అయితే ఇప్పుడు సైతం కంపెనీ ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఇవ్వబోతోందని ప్రకటించటంతో చాలా మంది పెట్టుబడిదారులు తమ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ రేపు అంటే సోమవారం రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ వార్తతో గత శుక్రవారం కొచ్చిన్ షిప్‌యార్డ్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో కంపెనీ షేర్ల ధర 10 శాతం పెరిగాయి.

కంపెనీ దాదాపు 16వ సారి తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ అందిస్తోంది. ఈ క్రమంలో ఒక్కో షేరుపై రూ.2.25 డివిడెండ్ ఇవ్వబోతున్నట్లు స్టాక్ మార్కెట్లకు అందించిన సమావేశంలో వెల్లడించింది. రికార్డు తేదీ సెప్టెంబర్ 23 కావటంతో కంపెనీ బుక్స్ ప్రకారం ఆ రోజున షేర్లను హోల్డ్ చేస్తున్న వ్యక్తులకు మాత్రమే డివిడెండ్ చెల్లించబడుతుంది. ఇప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు డివిడెండ్ ఆదాయం పొందాటానికి అర్హత పొందాలంటే షేర్లను కలిగి ఉండాలి. ఈ క్రమంలో రేపు మార్కెట్లో కంపెనీ షేర్ల కొనుగోలుకు భారీగా డిమాండ్ కనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
డిఫెన్స్ స్టాక్ శుక్రవారం 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి బీఎస్ఈలో ఒక్కోటి రూ.1,846.55గా ఉంది. డివిడెండ్ ప్రకటనతో చాలా కాలం తర్వాత కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు తన ఇన్వెస్టర్లకు ఏకంగా 225 శాతానికి పైగా రాబడిని అందించాయి. అలాగే 6 నెలల కాలంలో పెట్టుబడిదారులకు 100 శాతం రాబడిని కంపెనీ షేర్లు అందించాయి. బీఎస్ఈలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.2,977.10గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.436 వద్ద ఉంది. ఇదే క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.48,580గా ఉంది. ఈ ఏడాది జనవరిలో కంపెనీ తన షేర్లను స్ప్లిట్ చేసి రెండు ముక్కలు చేసింది. ఈ డిఫెన్స్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం మెుత్తంగా 70 శాతానికి పైగా వాలను హోల్డ్ చేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications