For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger: లక్షను మూడింతలు చేసిన స్టాక్.. స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్ మీ దగ్గర ఉందా..?

|

Multibagger Stock: స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా మల్టీబ్యాగర్ కంపెనీలు మనకు కనిపిస్తుంటాయి. దీనికి కారణం వాటిలో ఎక్కువగా అభివృద్ధి చెందే కంపెనీలు ఉండటమే. అలా కేవలం రెండేళ్లలో ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన షేర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మోల్ట్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ అనే హైదరాబాదీ కంపెనీ గురించే. ఇది ప్యాకేజింగ్ సొల్యూషన్లను అందించే వ్యాపారంలో 1986 నుంచి కొనసాగుతోంది. 1993 లో స్టాక్ మార్కెట్లోకి అరంగేట్రం చేసిన ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లను మంచి లాభాలతో ధనవంతులుగా మారుస్తూనే ఉంది. రెండేళ్ల క్రితం ఈ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టిన పెట్టుబడి విలువ ఈ రోజు మార్కెట్ విలువ ప్రకారం రూ.3.32 లక్షలకు చేరింది. రెండేళ్ల కిందట స్టాక్ ధర రూ.286.50 ఉండగా ప్రస్తుతం ఈ రోజు మార్కెట్లో స్టాక్ ధర రూ.953.25కి చేరుకుంది.

 కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ దేశంలో దృఢమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ వ్యాపారంలో అగ్రగామిగా ఉంది. కంపెనీ లూబ్స్, పెయింట్స్, ఫుడ్, ఇతర ఉత్పత్తుల కోసం ఇంజెక్షన్ మౌల్డ్ కంటైనర్ల తయారు చేస్తోంది. వేగవంతంగా సరఫరా చేసేందుకు కంపెనీకి దేశవ్యాప్తంగా ఏడు ప్రాసెసింగ్ ప్లాంట్లు, మూడు స్టాక్ పాయింట్లు ఉన్నాయి. కంపెనీకి అవసరమైన అతర్గత తయారీ సామర్థ్యం ఉన్నందున కంపెనీ తన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడదని తెలుస్తోంది.

కంపెనీ ఆదాయం..

కంపెనీ ఆదాయం..

రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపధికన 14.43% పెరిగి రూ.182.55 కోట్లకు చేరుకుంది. గ్రూప్-A స్టాక్స్‌లో భాగంగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.3,106.22 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,058 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.648.15గా ఉంది. ప్రస్తుతం కంపెనీలో 581 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దీని ప్రకారం కంపెనీ స్టాక్ రానున్న కాలంలో సైతం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary

Multibagger: లక్షను మూడింతలు చేసిన స్టాక్.. స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్ మీ దగ్గర ఉందా..? | Mold-Tek Packaging Ltd stock gave Multibagger Returns To Investors In 2 Years

Mold-Tek Packaging Ltd stock gave Multibagger Returns To Investors In 2 Years
Story first published: Wednesday, December 21, 2022, 12:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X