NRI News: స్నేహితుడి సైకిల్‌తో 10,000 ధరమ్స్ గెలుచుకున్న భారతీయుడు..!
స్నేహితుడి నుంచి అప్పుగా తీసుకున్న సైకిల్.. దాని అలంకరణ కోసం ఖర్చు చేసింది కేవలం 300 ధరమ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.7500 . కానీ తన సృజనాత్మక ఆలోచనతో ఏకంగా అతను 10,000 ధరమ్స్(రూ.2,50,000) బహుమతిని గెలుచుకున్నాడు ఓ భారతీయ ప్రవాసి. యూఏఈ పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న ఈ భారతీయుడికి దుబాయ్ రైడ్ పోటీలో అవార్డు దక్కింది. దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగంగా నిర్వహించిన 'డ్రెస్ యువర్ రైడ్' పోటీలో దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న మోహన్ చౌహాన్ విజేతగా నిలిచాడు. 'బెస్ట్ ఓవరాల్ బైక్' విభాగంలో ఆయనకు ఈ బహుమతి వచ్చింది.
విజేతలకు ఒక్కొక్కరికి Dh10,000 చొప్పున అందించారు. భారతదేశానికి వెళ్లిన తన స్నేహితుడి నుంచి సైకిల్‌ను అప్పుగా తీసుకున్న మోహన్, దానిని ఎలా అలంకరించాలనే ఆలోచన చేశాడు. ఇందుకు కొన్ని రోజులు తీసుకున్నాడు. చివరకు యూఏఈ పట్ల తన అభిమానాన్ని చాటుకునేందుకు 100 జాతీయ జెండాలతో సైకిల్‌ను అలంకరించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఓ కార్పెంటర్‌తో ప్రత్యేక ఫ్రేమ్ తయారు చేయించాడు. సైకిల్‌కు రెండో సీటును అమర్చి, యూఏఈ జాతీయ రంగుల్లో బెలూన్లు, ఇతర అలంకరణలు జోడించాడు. ఇలా నాలుగు రోజులపాటు కొంత సమయం కేటాయిస్తూ సైకిల్‌ను సిద్ధం చేశాడు. ఇందుకోసం మొత్తం రూ.7,500 ఖర్చు చేసినట్లు మోహన్ తెలిపాడు.

గత పదేళ్లకు పైగా యూఏఈలో పనిచేస్తున్న మోహన్ తన ఉద్యోగ ప్రయాణాన్ని వెయిటర్‌గా ప్రారంభించాడు. క్రమంగా ఎదుగుతూ ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. యూఏఈ తనకు ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో వీడియో గ్రఫీ, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తన భార్య, మూడేళ్ల కుమార్తె ప్రస్తుతం భారత్‌లో ఉన్నారని, భవిష్యత్తులో వారిని కూడా యూఏఈకి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ పోటీలో మోహన్‌తో పాటు మరో ముగ్గురు కూడా Dh10,000 చొప్పున బహుమతులు గెలుచుకున్నారు.
థాయ్‌లాండ్‌కు చెందిన తర్మియాతి సిండీ పొద్దుతిరుగుడు పువ్వు (Sunflower) రూపంలో తన సైకిల్‌ను అలంకరించి 'మోస్ట్ క్రియేటివ్ థీమ్' విభాగంలో విజేతగా నిలిచాడు. అదేవిధంగా ప్రత్యేక బోర్డులు, ఒకే తరహా దుస్తులు, మాస్కులతో సైకిళ్లను అలంకరించిన ఓ కుటుంబం 'బెస్ట్ ఫ్యామిలీ కాస్ట్యూమ్' అవార్డును దక్కించుకుంది. 'గార్డియన్స్ ఆఫ్ ది ఎమిరేట్స్' పేరుతో పాల్గొన్న ఈ కుటుంబం తమ సైకిళ్లకు బుర్జ్ ఖలీఫా నమూనాలను కూడా జత చేశారు. దుబాయ్ రైడ్ తరహాలోనే దుబాయ్ రన్‌లోనూ ప్రత్యేక దుస్తులు, సృజనాత్మక అలంకరణలతో పాల్గొనే వారికి బహుమతులు ప్రకటించారు. మొత్తం 10 మందికి ఒక్కొక్కరికి Dh10,000 చొప్పున అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ బిబ్ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఫొటోలు లేదా వీడియోలను దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియా ఖాతాలకు పంపి పోటీలో పాల్గొనవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications