PM Modi: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలకు కసరత్తులు జరుగుతున్న వేళ మోదీ ప్రభుత్వం ప్రజలను ప్రసన్నం చేసుకునే తాయిలాల ప్రకటనలో బిజీగా ఉంది. ఈ క్రమంలో మధ్యతరగతి ఆదాయ వర్గాల కోసం పలు ప్రకటనలు చేస్తోంది.
తాజాగా ఇదే క్రమంలో దేశంలోని చిన్న సన్నకారు రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నరైతులకు మరింత మద్దతును అందించేందుకు వారికి అందిస్తున్న రూ.6,000 సహాయాన్ని రూ.8,000లకు పెంచాలని చూస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలిసిన ఇద్దరు అధికారులు ఈ వివరాలను వెల్లడించటంతో వార్త బయటకు వచ్చింది. అయితే ఇది ఇంకా పరిశీలనలోనే ఉందని ఒకవేళ మోదీ సర్కార్ కావాలనుకుంటే త్వరలోనే ప్రకటన చేయెుచ్చని సమాచారం.

ఒకవేళ కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపితే 200 బిలియన్ రూపాయలు అదనపు భారం భారత ప్రభుత్వంపై పడనుంది. అయితే దీనిపై స్పందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నాను భాసిన్ నిరాకరించారు. దేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు 65% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మూడవసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న మోడీకి రైతులు కీలకమైన ఓటర్లుగా ఉన్నారు. జనాధరణ పొందుతున్న నాయకుడిగా ఉన్నప్పటికీ.. దేశంలో 55% మంది ఓటర్లు మాత్రమే ఆయనను అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
దీనికి తోడు దేశంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత భారీగా పెరిగిన అసమానతలు, నిరుద్యోగం చుట్టూ ఉన్న సమస్యలు ఎన్నికల్లో పెద్ద సవాలుగా నివలనున్నాయి. భారతదేశం కూడా ఐదేళ్లలో అత్యంత బలహీనమైన రుతుపవన వర్షాలను నమోదు చేసిన తరుణంలో.. బియ్యం, ఉల్లి, పంచదార వంటి ఎగుమతులపై తెచ్చిన ఆంక్షలు వంటి వంటి ద్రవ్యోల్బణ-నియంత్రణ చర్యలు గ్రామీణ ఆదాయాలను తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులకు ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కనీస మద్దతు ధర విషయంలో కృషి చేస్తోంది.


Click it and Unblock the Notifications