Elections stocks: దేశంలో జరిగే ప్రతి వేడుకకు, స్పెషల్ ఈవెంట్‌కు అనుగుణంగా స్టాక్స్ రెస్పాండ్ అవుతుంటాయి. మరి అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ వేళ వివిధ స్టాక్స్ హాట్ కేక్స్‌లా మారాయి. కేంద్రంలో మరోసారి BJP గెలిచి ప్రధానిగా మోదీ పగ్గాలు చేపడితే పెరిగే స్టాక్స్‌పై ఇప్పుడు అందరూ దృష్టి కేంద్రీకరించారు. విదేశీ సంస్థలు సైతం ఇదే విషయంపై ఆసక్తి కనబరుస్తున్నాయి.
'మోదీ స్టాక్స్' పేరిట ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ CLSA ఓ ప్రత్యేక లిస్ట్ రిలీజ్ చేసింది. ప్రధానిగా గత 10 ఏళ్లలో మోదీ అమలు చేసిన సంస్కరణల వల్ల భారీ వృద్ధి సాధించిన కంపెనీలతో ఈ జాబితాను తయారు చేయడంతో ఆ పేరు పెట్టింది. మొత్తం 54 స్టాక్స్ ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం భారీ వృద్ధితో అవి దూసుకుపోవడం ఖాయమని CLSA అంచనా వేస్తోంది.

ఈ జాబితాలో సగానికి పైగా ప్రభుత్వరంగ సంస్థలే ఉండటం గమనార్హం. కేంద్రంలోని భాజపా సర్కారు పాలసీల వల్ల ఆ స్టాక్స్ భారీగా లాభం పొందినట్లు CLSA వెల్లడించింది. కాగా ఆ లిస్టులో NTPC, NHPC, PFC, ONGC, IGL, మహానగర్ గ్యాస్‌తో పాటు L&T, ఎయిర్‌టెల్, రిలయన్స్, ఇండస్ టవర్స్ వంటి స్టాక్స్ ఉన్నాయి.
ఎన్నికల కోలహలానికి ముందు నుంచి లిస్టులోని మెజారిటీ స్టాక్స్ నిఫ్టీని బీట్ చేసే రిటర్న్స్ ఇచ్చినట్లు CLSA పేర్కొంది. ఇక ఎన్నికల అనంతరం బ్యాంక్ స్టాక్స్‌లో మంచి ర్యాలీ ఉండవచ్చని అంచనా వేసింది. ప్రభుత్వ రంగ కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయాలని మోదీ ఇటీవల సూచించినట్లు గుర్తు చేసింది. మౌలిక వసతుల కల్పనపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టనుందని.. తద్వారా ఇన్‌ఫ్రా, సిమెంట్, రియాల్టీ స్టాక్స్ దూకుడు కనబరచవచ్చనే అంచనాలు ఉన్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications