Manmohan Singh: ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ 2016లో అతిపెద్ద సమచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్న డబ్బును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో పెద్ద నోట్లను చెలామణి నుంచి డీమానిటైజేషన్ ప్రక్రియ ద్వారా తీసుకుని దానికి బదులుగా కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. నేరుగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రజలకు మీడియా ద్వారా అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే దేశంలో బ్లాక్ మనీ, డీమానిటైజేషన్ అంశాలపై దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసిన చేశారు. మోదీ సర్కార్ తీసుకున్న సడన్ నిర్ణయంపై అప్పుడు ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి పరిశీలిస్తే.. దేశంలోని పరిస్థితి బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై శక్తివంతమైన నేరారోపణగా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో సృష్టించిన ఉద్యోగాల డేటాపై, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెల్లడించిన సంఖ్యలు సందేహాస్పదంగా ఉన్నాయని మన్మోహన్ సింగ్ అన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనను సమర్థిస్తూ మోదీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయని అప్పట్లో సింగ్ అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో మోదీ సర్కార్ అప్పట్లో చేపట్టిన డీమానిటైజేషన్ ఒక చారిత్రాత్మకమైన తప్పిదంగా మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనిని సరిగా అమలు చేయటంలో బీజేపీ ప్రభుత్వం విఫలం కావటం వల్ల చాలా మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశంలోనైనా ప్రజలు తాము బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి వాటిని తిరిగి వెనక్కి తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయా అంటూ కూడా ప్రశ్నించారు. సామాన్య ప్రజలు ఆ సమయంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి బారులు తీరి నిల్చువాల్సిన పరిస్థితులు రావటానికి సరైన ప్రణాళిక లేకుండా డీమానిటైజేషన్ ప్రకటించటమే కారణంగా మన్మోహన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో దాదాపు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను సైతం కోల్పోయిన సంఘటనలు మనం చూశాం.
నల్లధనాన్ని రూపుమాపటంతో పాటు ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో డీమానిటైజేషన్ దోహదపడుతుందని మోదీ సర్కార్ చెప్పిన మాటలతో కొంత ఏకీభవించినప్పటికీ దానిని చేపట్టిన విధానం బాగోలేదని సింగ్ అన్నారు. ఆ సమయంలో 500, 1000 నోట్లను ఆర్థిక వ్యవస్థ నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం గ్రామీణ భారతీయ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. అలాగే మోదీ ప్రజలను సంయమనం పాటించాలని 50 రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తాయని పేర్కొనటాన్ని తప్పుపట్టారు. పేద ప్రజలు తమ అవసరాల కోసం 50 రోజుల వరకు వేచి ఉండటం ఎలా కుదురుతుందని మన్మోహన్ రాజ్యసభలో ప్రస్థావించారు. ప్రధానంగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ మోదీ సర్కార్ తీసుకున్న అకస్మాత్తు డీమానిటైజేషన్ నిర్ణయం వల్ల భారీగా నష్టపోయిందని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications