ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మోదీ–పుతిన్ ప్లాన్ ఏమిటి?

చైనా లోని టియాంజిన్‌లో జరిగిన ఇండియా-రష్యా ద్వైపాక్షిక భేటీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని కలిసి సంబంధాల బలాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే అమెరికా తాజాగా భారతీయ వస్తువులపై 50% టారిఫ్ కొట్టింది. అంతేకాదు, ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తున్నందుకు "మీరు ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు పెడుతున్నారు" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా విమర్శించాడు.

Modi-Putin meeting India-Russia relations Russian oil imports Ukraine war Strategic partnership India-Russia defence cooperation Energy ties Global politics US tariffs on India Economic impact on India

మోదీ భేటీ సందర్భంగా స్పష్టంగా చెప్పారు "భారత్, రష్యా ఎప్పుడూ ఒకరికి ఒకరు కష్టకాలంలో పక్కన నిలబడ్డాయి. మా సహకారం రెండు దేశాలకే కాదు, గ్లోబల్ పీస్, స్టెబిలిటీకి కూడా కీలకం" అని. పుతిన్ కూడా ఆ మాటకు అంగీకరించాడు. "ఇండియా-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ డిసెంబర్‌కి 15 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సంబంధం విలువల మీద ఆధారపడి, చాలా రంగాల్లో సహకారం కొనసాగుతుంది" అని అన్నాడు.

2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యా చమురు కొనడాన్ని తగ్గించాయి. అప్పుడు ఆ గ్యాప్‌ని ఫిల్ చేసింది ఇండియానే. చవకగా ముడి చమురు కొని, రిఫైనరీలు లాభం చూసుకున్నాయి. ప్రస్తుతం భారత్ చమురు దిగుమతుల్లో 36% రష్యా నుంచే వస్తోంది. మిగతా సరఫరాదారులు ఇరాక్ 20%, సౌదీ 14%, యుఏఈ 9%, అమెరికా 4%.

అమెరికా మాత్రం భారత్‌ను "డిస్కౌంట్ చమురుతో ప్రాఫిట్ కొడుతోంది" అని ఆరోపిస్తోంది. కానీ ఇండియా కూడా సమాధానం ఇలా ఇచ్చింది "మీరు ఇంకా బిలియన్ల డాలర్ల విలువైన రష్యన్ గూడ్స్ కొనుగోలు చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని ఎందుకు సింగిల్ అవుట్ చేస్తున్నారు?" అని.

ఎనర్జీ, స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ మాత్రమే కాకుండా మోదీ, యుద్ధం ఆపడానికి కూడా ఫోకస్ పెట్టారు. పుటిన్‌తో మాట్లాడుతూ "ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగియాలి. ఇది మానవత్వం పిలుపు. శాశ్వత శాంతి కోసం అన్ని పక్షాలు ముందుకు రావాలి" అని స్పష్టంగా చెప్పారు.

ఇక పుతిన్ ని కలుసుకునే ముందు మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా మాట్లాడారు. జెలెన్స్కీ మాట్లాడుతూ "మోదీ సరైన సందేశం రష్యా, ఇతర నేతలకు చేరుస్తారని నమ్ముతున్నాను" అన్నారు.

గేమ్‌లో నెక్స్ట్ మూవ్?

ఇండియా-రష్యా సంబంధాలు ఎప్పుడూ "స్టెడి & టైమ్-టెస్టెడ్" అని చెప్పబడతాయి. ఆయుధాలు నుంచి చమురు వరకు రెండు దేశాలు గాఢమైన సహకారం పంచుకున్నాయి. ఇప్పుడు అమెరికా ఒత్తిడి పెడుతున్నా, మోదీ-పుతిన్ బంధం అంతగా షేక్ అవ్వదనిపిస్తోంది.

భారత ఆర్థిక వ్యవస్థపై రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్‌ దిగుమతి పెద్ద సపోర్ట్‌గా మారింది. దీని వల్ల ద్రవ్యోల్బణం కొంత వరకు కంట్రోల్‌లో ఉండి, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెద్దగా మారకుండా స్టేబుల్‌గా ఉన్నాయి. అలాగే రిఫైనింగ్‌లో కూడా ఇండియాకి మంచి అడ్వాంటేజ్ ఉంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ తెచ్చుకుని ఇక్కడ ప్రాసెస్ చేసి డీజిల్, జెట్ ఫ్యూయల్‌లుగా మార్చి యూరప్‌కి ఎక్కువ ప్రాఫిట్‌తో అమ్మడం జరుగుతోంది. అయితే ఈ ప్రయోజనాల మధ్య ఒక రిస్క్ కూడా ఉంది. సాంక్షన్స్ ఇంకా కఠినం అయితే, బ్యాంకింగ్, పేమెంట్ ఛానల్స్ విషయంలో ఇండియాకి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.

భారత్-రష్యా రక్షణ & టెక్ సహకారం చాలా స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది. ఇప్పటికీ రష్యా మనకి పెద్ద వెపన్స్ సప్లయర్‌గానే ఉంది. ఫైటర్ జెట్స్, సబ్‌మెరైన్స్, S-400 సిస్టమ్స్ అన్నీ అక్కడినుంచే వస్తున్నాయి. దాంతో పాటు AK-203 రైఫిల్స్, బ్రహ్మోస్ మిసైల్‌ లాంటి జాయింట్ ప్రాజెక్టులు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎనర్జీ టెక్నాలజీ, న్యూక్లియర్ రంగంలో కూడా కలసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది చివర్లో పుటిన్ భారత్‌కి రావొచ్చు. అప్పటికి గ్లోబల్ పాలిటిక్స్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. కానీ ఒక విషయం క్లియర్ ఇండియా, రష్యా స్నేహం ఇంకా "ఆన్ ట్రాక్"లోనే ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+