ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన అత్యంత కీలకమైన సమావేశం ముగిసింది. ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం.. రష్యా నుంచి మనం ఎక్కువగా చమురు దిగుమతి చేసుకోవడం వల్ల ఏర్పడిన వాణిజ్య లోటును తగ్గించడం. అంటే మనం రష్యాకు కూడా పెద్ద ఎత్తున వస్తువులను అమ్మడం ద్వారా ఈ లోటును పూడ్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

2030 నాటికి 100 బిలియన్ల టార్గెట్
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు 2030 సంవత్సరం వరకు భారత్-రష్యా ఆర్థిక సహకారాన్ని పెంచేందుకు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించారు. ఈ దశాబ్దం చివరి నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏకంగా 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 లక్షల కోట్లు) కు పెంచాలని భారీ లక్ష్యం పెట్టుకున్నారు. మన దేశంలోని ఫార్మసీ (మందులు), ఆటోమొబైల్స్ (కార్లు, వాహనాలు), వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు వంటి అనేక వస్తువులకు రష్యా మార్కెట్‌లో ఎక్కువ స్థానం కల్పించేలా ఈ ప్రణాళిక రూపొందించారు. రష్యా నుంచి వచ్చిన పెద్ద వ్యాపార బృందం, ఐరోపా దేశాల నుంచి కాకుండా భారతదేశం వంటి మిత్ర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికి తమకు ఆసక్తి ఉందని స్పష్టం చేసింది.
డిఫెన్స్ డీల్
భారత్-రష్యా మధ్య ఉన్న నమ్మకమైన స్నేహానికి రక్షణ రంగ సహకారం పునాది అని చెప్పొచ్చు. భారత్-రష్యా భాగస్వామ్యంలో రక్షణ సహకారం ఎప్పుడూ మూలస్తంభంగా నిలిచింది. ఈ సమావేశంలో ఈ అంశంపై మరింత బలం చేకూరింది. మన దేశ రక్షణ అవసరాల కోసం అదనంగా మరో ఐదు S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసే విషయంపై చర్చలు జరిగాయి. అలాగే నావికాదళ శక్తిని పెంచేందుకు, సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన అణుశక్తితో నడిచే జలాంతర్గామిని దీర్ఘకాలికంగా లీజుకు తీసుకునే ఒప్పందాన్ని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే సైనిక కదలికలకు పరస్పర లాజిస్టికల్ మద్దతును ప్రామాణీకరించే లాజిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ (Relos) ఒప్పందాన్ని రష్యా ఆమోదించింది.
ఎవరి మాట వినకుండా..
ఈ సమావేశం కేవలం డీల్స్‌కే పరిమితం కాలేదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన ప్రాధాన్యత ఉంది. ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో తమను ప్రపంచం ఏకాకిని చేయలేకపోయిందని, శక్తివంతమైన భారత్ మద్దతు తమకు ఉందని ఈ భేటీ ద్వారా రష్యా ప్రపంచానికి గట్టిగా చెప్పింది. అలాగే బయటి దేశాలు ముఖ్యంగా అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా.. మన జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు కీలకమైన సంబంధాలను స్వేచ్ఛగా కొనసాగిస్తామని భారత్ కూడా స్పష్టం చేసింది.
మొత్తం మీద ఈ భేటీ భారత్-రష్యా సంబంధాలకు కొత్త శక్తిని ఇవ్వడంతో పాటు, రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక రాజకీయాల్లో ఈ రెండు దేశాలు తమ సొంత మార్గంలో ముందుకు సాగుతాయని తేలింది. అమెరికా ఆంక్షలు లేదా ఇతర బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గమని భారత్ ఈ సమావేశం ద్వారా పశ్చిమ దేశాలకు స్పష్టమైన సంకేతం పంపుతోంది. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications