Modi US Visit: ట్రంప్ ఆగ్రహం నుంచి మోదీ ఇండియాను కాపాడతారా..? ట్రంపుకు తాయిలం సిద్ధం
Modi-Trump Meet: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ఎంపికైన వేళ ఇండియా తన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీగా సుంకాలను ప్రకటించిన వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. అయితే ఈ ఉచ్చులో ఇండియా చిక్కుకోకుండా చూసుకునేందుకు టీం మోదీ అమెరికా పర్యటనకు సిద్ధం అవుతోంది.
ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికాతో దైవాక్షిక చర్చలు జరిపేందుకు ఈవారం బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటనలో ముఖ్య అజెండా ట్రంప్ ఆగ్రహానికి భారత్ గురికాకుండా చూడటమేనని తెలుస్తోంది. దీనికి ముందు గతవారం అక్రమవలసదారులను ట్రంప్ యుద్ధవిమానంలో ఇండియాకు పంపించటం కూడా స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన ద్వారా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై సుంకాన్ని తగ్గించే ప్రతిపాదనను ట్రంప్ ముందు ఇండియా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా ప్రధాన పారిశ్రామిక వస్తువుల ఎగుమతులపై భారతదేశ దిగుమతి సుంకాలు చాలా తక్కువగా లేదా సున్నాగా ఉండటంపై వివరణ ఇవ్వటం ద్వారా వాస్తవాలను ట్రంప్ ముందు పెట్టాలని భారత్ చూస్తోంది. ఇదే క్రమంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తుల విషయానికి వస్తే బాదంపప్పు దిగుమతులపై ఇప్పటికే సుంకాలను ఇండియా తగ్గించిందని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే యూఎస్ నుంచి దిగుమతి అయ్యే పెకాన్ నట్స్ వంటి మరికొన్ని వస్తువులపై కూడా సకాలంలో సుంకాలను తగ్గించే అవకాశాన్ని ఇండియా పరిశీలించవచ్చని వారు భావిస్తున్నారు.
వాస్తవానికి 2023 ప్రారంభం వరకు ఇండియా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పెకాన్ నట్స్ పై 100 శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. కానీ ఆతర్వాత పన్నును 30 శాతానికి తగ్గించింది. ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులపై మరింతగా పన్నులను తగ్గించటానికి ఇండియా ఆసక్తి చూపవచ్చని తెలుస్తోంది. ప్రధాని మోదీ యూఎస్ పర్యటన తర్వాత ట్రంప్ ఆగ్రహం చల్లారి ఇండియా ఆందోళనలు తగ్గించే ప్రకటనలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి కెనడా, మెక్సికోల విషయంలో కూడా ట్రంప్ ఇలాగే ప్రతిస్పందించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఇజ్రాయెల్, జపాన్ దేశాధినేతలు కలిసిన సంగతి తెలిసిందే. వీరి తర్వాత ఇండియా నుంచి ప్రధాని మోదీ ట్రంప్‌ను కలవటానికి వెలుతున్నారు. అలాగే ట్రంప్ ను కలవటానికి జోర్డాన్, ఈజిప్ట్, యూకే అధ్యక్షులు కూడా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. మోదీ తాజా పర్యటనలో ట్రంప్ 2019లో రద్దు చేసిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కింద భారతీయ ఎగుమతిదారులకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించమని కోరే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అన్నింటికంటే ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదారులను ఎలా వెనక్కి తీసుకురావాలనే విషయంపై కూడా ఇరుదేశాధినేతలు చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications