AB-PMJAY News: ఈ నెల 23న మోదీ సర్కార్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ క్రమంలో చాలా మంది కొత్త బడ్జెట్ ప్రసంగంపై అనేక ఆశలు పెట్టుకున్నారు. అలాగే ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనకరమైన కొన్ని స్కీమ్స్ ప్రయోజనాలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
2024లో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(AB-PMJAY) లబ్ధిదారుల సంఖ్యను వచ్చే మూడేళ్లలో రెట్టింపు చేయాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత 70 ఏళ్లు పైబడిన వారందరికీ బీమా కవరేజీని ఏడాదికి రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రం ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. నేషనల్ హెల్త్ అథారిటీ అంచనాల ప్రకారం ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఖజానాపై ఏడాదికి రూ.12,076 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అధికారిక వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రానున్న మూడేళ్లలో AB-PMJAY కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇది అమలులోకి వస్తే దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి ఆరోగ్య భద్రతను అందిస్తుంది. కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడానికి వైద్య ఖర్చులు కూడా ఒక ప్రధాన కారణమని మనందరికీ తెలిసిందే. కవరేజీ పరిమితిని ఇప్పుడున్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు రెట్టింపు చేయాలనే ప్రతిపాదనను ఖరారు చేసిన తర్వాత కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీని గురించి ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. AB-PMJAYకి రూ.5 లక్షల పరిమితి 2018లో నిర్ణయించింది.
2024 మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం 'AB-PMJAY' కోసం కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. ఇది 12 కోట్ల కుటుంబాలకు ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరేందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య రక్షణను అందిస్తుంది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు వస్తారని, ఉచిత చికిత్స ప్రయోజనాలు పొందుతారని చెప్పారు.


Click it and Unblock the Notifications