ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దీంతో ముడి చమురు ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) భారత ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇంధన ప్రమాద పరిస్థితులను అత్యవసరంగా సమీక్షించాలని, ముడి చమురు వనరులను నిల్వ ఉండేలా చూసుకోవాలని కోరింది. ఈ యుద్ధం కారణంగా.. భారతదేశం కూడా ఆర్థిక పతనానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ యుద్ధంతో ఇంధన భద్రత, వాణిజ్య మార్గాలుతో పాటుగా కీలక వాణిజ్య ప్రయోజనాలు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయని GTRI తెలిపింది.
ఇక యుద్దం జరుగుతున్న రెండు దేశాలతో భారతదేశం స్వేహపూర్వక వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ రెండు దేశాల ఉద్రిక్త పరిస్థితులు భారతదేశ ఆర్థికవ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది. భారత్.. ఇరాన్, ఇజ్రాయెల్‌కు వివిధ వస్తువులను ఎగుమతి చేస్తుంది. అలాగే చాలా వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగితే భారత్ లో అనేక వస్తువుల ధరలు గణనీయంగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పును కలిగించే అవకాశాలు ఉన్నాయని GTRI వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెబుతున్నారు.

2024-25లో భారతదేశం ఇరాన్‌కు USD 1.24 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. అలాగే USD 441.9 మిలియన్లను దిగుమతి చేసుకుంది. ఇక మరో దేశం ఇజ్రాయెల్ కు USD 2.15 బిలియన్ల ఎగుమతులు చేయగా USD 1.61 బిలియన్ల దిగుమతులు చేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణ పరిస్థితులు తీవ్రమయితే ఈ ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇదిలా ఉంటే భారత్ చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశాల పైనే ఆధారపడుతోంది. దాదాపు 85 శాతం చమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న వివాదంతో భారతదేశానికి ముడి చమురు దిగుమతికి సంబంధించి ముఖ్యమైన సవాళ్లు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడి చమురు ధర నిరంతరం పెరుగడం. అలాగే సరఫరాపై సందిగ్ధ పరిస్థితులు నెలకొనడం వంటి అంశాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే చమురు మార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధి ఒకవేళ మూసివేస్తే.. భారతదేశ చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాగా హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ఇప్పటికే బెదిరింపులకు కూడా దిగింది.
ఈ ఇరుకైన జలమార్గం.. కేవలం 21 మైళ్ల వెడల్పు మాత్రమే ఉంది, ఇది ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు ఐదవ వంతు రవాణాకు కీలకంగా ఉంది. 80 శాతానికి పైగా ఇంధన అవసరాలకు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడిన భారతదేశానికి ఈ జలసంధి చాలా అవసరం.హార్ముజ్ జలసంధిలో ఏదైనా మూసివేత లేదా సైనిక అంతరాయం వల్ల చమురు ధరలు, షిప్పింగ్ ఖర్చులు, బీమా ప్రీమియంలను తీవ్రంగా పెంచుతుందనే ఆందోళన ఇప్పుడు కలుగుతోంది.ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని.. రూపాయిపై ఒత్తిడి తెస్తుందని, భారతదేశ ఆర్థిక నిర్వహణను క్లిష్టతరం చేస్తుందని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
జూన్ 15న ఇజ్రాయెల్‌లోని హైఫా ఓడరేవుపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించినప్పుడు ఆందోళన మరింత రూపం దాల్చిందని శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఓడరేవు ఇజ్రాయెల్ దిగుమతుల్లో 30 శాతానికి పైగా నిర్వహించే సౌకర్యం, 70 శాతం భారతదేశ అదానీ పోర్ట్స్ యాజమాన్యంలో ఉందని శ్రీవాస్తవ చెప్పారు.ఇప్పటికే యుద్ద ప్రభావంతో ఓడరేవు మౌలిక సదుపాయాలు, సమీపంలోని శుద్ధి కర్మాగారాలకు నష్టం వాటిల్లినట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. దీనివల్ల లాజిస్టిక్స్ అంతరాయం కలిగిస్తుందనే భయాలు, భారత వాణిజ్య కార్యకలాపాలలో సంఘర్షణ చెలరేగుతుందని ఆయన అన్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే జూన్ 14-15 తేదీలలో యెమెన్‌లోని హౌతీ సైనిక నాయకత్వంపై ఇజ్రాయెల్ చేసిన దాడి ఎర్ర సముద్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలను పెంచింది. అక్కడ హౌతీ దళాలు ఇప్పటికే వాణిజ్య నౌకలపై దాడిని ప్రారంభించాయి. దీని ప్రభావం కూడా భారత్ మీద పడనుంది. యూరప్, ఉత్తర ఆఫ్రికా, యుఎస్ తూర్పు తీరానికి భారతదేశం పశ్చిమ దిశగా చేసే ఇంజనీరింగ్ వస్తువులు, వస్త్రాలు, రసాయనాలు వంటి ఎగుమతుల్లో దాదాపు 30 శాతం బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా రవాణా జరుగుతుంది. ఈ దాడులతో ఈ ఎగుమతులు కూడా సందిగ్ధంలో పడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర,దేశంలో వాటిపై విధించే ఎక్సైజ్ సుంకం మరియు రాష్ట్రాలు విధించే వ్యాట్ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభావితం అవుతాయి. ముడి చమురు ధరలో తగ్గుదల ఉంటే, పెట్రోల్, డీజిల్ ధర తగ్గే అవకాశాలు పెరుగుతాయి, అయితే పెరుగుదల ఉంటే పెరుగుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణం మధ్య దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.దీంతో పాటు దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరిగే అవకాశం ఉంది. అలాగే ద్రవ్యోల్బణం ప్రమాదం కూడా పెరగవచ్చు.
ఇజ్రాయెల్-ఇరాన్ వార్ తో ఇండియాలో విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆప్టికల్, ఫోటో, సాంకేతిక వైద్య పరికరాలు, ఇనుము, ఉక్కు, గమ్స్, రెసిన్లు, లక్కలు, పండ్లు, గింజలు, కూరగాయల ఉత్పత్తులు వంటి వాటి ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని రంగాల్లో కూడా ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
More From GoodReturns

Iran war: యుద్ధం ఎప్పుడు ఆపాలో మేమే తేలుస్తాం.. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న మాటల యుద్ధం!

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

మోదీ ఒక్క ఫోన్ చేస్తే చాలు.. ఇరాన్ యుద్దం క్షణాల్లో ఆగిపోతుంది.. యూఏఈ రాయబారి కీలక వ్యాఖ్యలు..

ముంచుకొస్దున్న గ్యాస్ ముప్పు.. హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నౌకలు.. నష్టం రూ. 10 వేల కోట్ల పై మాటే.

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..



Click it and Unblock the Notifications